Begin typing your search above and press return to search.
వారం పాటు సెట్స్ లో చిరుతో సల్మాన్ భాయ్
By: Tupaki Desk | 11 Jan 2022 5:32 AM GMTకొన్ని కలయికలు అరుదుగానే సాధ్యమవుతాయి. అలాంటి అరుదైన దృశ్యం టాలీవుడ్ తెరపై ఆవిష్కృతం కాబోతోంది. చిరకాల మిత్రులు సల్మాన్ ఖాన్- చిరంజీవి ఏకం కాబోతున్నారు. జనవరి చివర్లో వీరిద్దరూ గాడ్ ఫాదర్ షూటింగ్ చేయనున్నారని సమాచారం.
సల్మాన్ ఖాన్ కి ఇప్పుడు షెడ్యూల్ అనుకూలతపై క్లారిటీ వచ్చిందని తెలిసింది. ఇప్పటికే అతడు తన ఆన్ స్క్రీన్ శత్రువైన ఇమ్రాన్ హష్మీతో కలిసి ముంబైలోని ఒక స్టూడియోలో టైగర్ 3 షూటింగ్ చేస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ని 2022లో ప్రారంభించాడు. టైగర్ 3 చివరి షెడ్యూల్ ని ఢిల్లీలోని ఒరిజినల్ లైవ్ ప్రదేశాలలో ప్రారంభించడానికి భాయ్ సిద్ధమవుతున్నాడు. అయితే పెరుగుతున్న COVID-19 కేసుల కారణంగా అది ఆలస్యం అయింది.
ఇప్పుడు ఈ నెలలో చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ లో సల్మాన్ తన లెంగ్తీ అతిధి పాత్ర చిత్రీకరణకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ``టైగర్ 3 అవుట్ డోర్ షెడ్యూల్ ఆలస్యం అయింది. లాజిస్టిక్స్ పై పని చేయడానికి సల్మాన్ అతని బృందం ఆలోచిస్తోంది. చిరంజీవి-గాడ్ ఫాదర్ బృందంతో నిరంతరం టచ్ లో ఉన్నారు. జనవరి చివరి నాటికి సల్మాన్ - చిరంజీవి ఈ యాక్షన్-ప్యాక్డ్ పొలిటికల్ థ్రిల్లర్ కోసం కలుస్తారని తెలుస్తోంది`` అని తెలిసింది. సల్మాన్ చిరుతో కలిసి హైదరాబాద్ లో ఒక వారం పాటు షూటింగ్ చేయనున్నారు.
ఇద్దరు సూపర్ స్టార్ లు మొదటిసారిగా స్క్రీన్-స్పేస్ ను పంచుకోవడం పై అభిమానులతో పాటు చిత్రబృందం కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ కలయికను తెరపై చూడాలని కలలు గంటున్నారు. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ కి అధికారిక రీమేక్ ఇది. ఒరిజినల్ లో పృథ్వీరాజ్ తో మోహన్ లాల్ పాత్ర ఆకట్టుకుంటుంది. పృథ్వీరాజ్ చేసిన పాత్రలోనే సల్మాన్ నటిస్తున్నారు. సల్మాన్ ప్రత్యేక పాత్ర డైనమిక్ .. అతను ప్రస్తుతం షూటింగ్ కోసం 5 నుండి 7 రోజులు కేటాయించాడు. అతని రంగ ప్రవేశాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్మాతలు లార్జర్ దేన్ లైఫ్ అనే కంటే గొప్ప సీన్స్ ని డిజైన్ చేశారట. గాడ్ ఫాదర్ ను పాన్ ఇండియా ఫిల్మ్ గా ప్రమోట్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని అంచనా.
ముఖ్యంగా కోవిడ్ సన్నివేశంపై ఆధారపడి షూట్ జనవరి చివరిలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో తాజాగా ప్రారంభమవుతుంది. ఏపీ లేదా టీజీ ప్రభుత్వం సినిమా షూట్ లపై ఆంక్షలు పెడితే షెడ్యూల్ వాయిదా పడుతుంది. కానీ నేటి పరిస్థితుల ప్రకారం.. జనవరిలో సల్మాన్ -చిరంజీవిలతో గాడ్ ఫాదర్ షెడ్యూల్ ని చిత్రీకరించాలని టీమ్ చూస్తోంది అని తెలిసింది.
గాడ్ ఫాదర్ తో పాటు సల్మాన్ కూడా ఫిబ్రవరిలో టైగర్ 3ని పూర్తి చేయాలని భావిస్తున్నారు. మార్చి మధ్య నాటికి అతను సాజిద్ నదియాడ్ వాలా ప్రొడక్షన్ కభీ ఈద్ కభీ దీపావళి షూటింగ్ ను ప్రారంభిస్తాడు. ఆపై నో ఎంట్రీ 2తో దానిని కొనసాగించాలని భావిస్తున్నాడు. దబాంగ్ 4- బ్లాక్ టైగర్ .. పవన్ పుత్ర భాయిజాన్ తదితర చిత్రాలు భాయ్ క్యూలో ఉన్నాయి.