Begin typing your search above and press return to search.
'గాడ్ ఫాదర్' కోసం రూపాయి కూడా ఛార్జ్ చేయని సల్మాన్
By: Tupaki Desk | 1 Oct 2022 10:57 AM GMTమెగాస్టార్ చిరంజీవి..రామ్ చరణ్ తేజ్ తో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ బాండింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. మెగాఫ్యామిలీతో భాయ్ ఎంతో చనువుగా మెలుగుతారు.చిరు..చరణ్ లతో ఎంతో స్నేహంగా ఉంటారు. సల్మాన్ ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా మెగాస్టార్ ఇంట అతిధ్యం తప్పనిసరి. వ్యక్తిగత పనులు మీద వచ్చినా...షూటింగ్ నిమిత్తం వచ్చినా చిరు ఇంట్లో లంచ్..డిన్నర్ లాంటివి తప్పనిసరిగా తీసుకోవాల్సిందే.
లేదంటే ఆ కుటుంబం భాయ్ ని విడిచిపెట్టదు. అంతటి బాండింగ్ కొన్నేళ్లగా కొనసాగుతుంది. ఆ స్నేహంతోనే రామ్ చరణ్ గాడ్ ఫాదర్ లో చిన్న పాత్ర ఉంది నటించాలి అని కోరగా మరో మాట లేకుండా ఒప్పుకున్నారు. కథ..అందులో తన పాత్ర ఎలా ఉంటుంది? అని కూడా అడగకుండా ఒకే చేసారు. ఒకే ఒక్క ఫోన్ కాల్ తో భాయ్ హైదరాబాద్ లో దిగిపోయారు.
తన పాత్ర షూటింగ్ పూర్తి చేసుకుని వెళ్లిపోయారు. మరి ఈ సినిమాకి సల్మాన్ ఖాన్ ఎంత ఛార్జ్ చేసినట్లు? ఒక్కో హిందీ సినిమాకు కోట్ల రూపాయలు పారితోషికం తీసుకుంటారు? సినిమాలో వాటా సైతం తప్పనిసరి? మరి అలాంటి భాయ్ `గాడ్ ఫాదర్` కోసం కూడా భారీగానే ఛార్జ్ చేసి ఉంటారని అంతా భావించొచ్చు. కానీ ఈ సినిమా కోసం సల్మాన్ ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదు.
ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసారు. భాయ్ తో పారితోషికం గురించి మాట్లాడమని హైదరాబాద్ నుంచి ముంబైకి ఒక వ్యక్తిని పంపిచాను. కానీ అలా పంపించినందకు ఆయన ఎంతో బాధపడ్డారు. ఇలాంటివి వద్దు వదిలేయండని చిరంజీవికి వెంటనే భాయ్ ఫోన్ చేసి చెప్పారుట. దీన్ని బట్టి మెగా ఫ్యామిలీ అంటే సల్మాన్ ఎంత ప్రాధాన్యత ఇస్తారు? అన్నది మరోసారి తేటతెల్లమవుతుంది.
ఎలాంటివి ఆశించకుండా కేవలం మెగాస్టార్ కోసమే భాయ్ సినిమా చేసినట్లు తెలుస్తోంది. దీంతో చిత్ర నిర్మాతలకు కోట్ల రూపాయలు ఆదా అయినట్లే. సల్మాన్ ఖాన్ పోషించింది గెస్ట్ పాత్ర అయినా ఆయన బ్రాండ్ తోనే పెద్ద ఎత్తున మార్కెట్ జరగడానికి అవకాశం ఉంది. పైగా సినిమా హిందీలో కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి అక్కడ మార్కెట్ పరంగా భాయ్ ఎంట్రీ కీలక పాత్ర పోషిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
సల్మాన్ని తెరపై చూసేందుకే ఎంతో మంది అభిమానులు తరలివస్తారు. సినిమాకి పాజిటవ్ టాక్ వస్తే సల్మాన్ ఇంపాక్ట్ సినిమాపై భారీగా ఉంటుందని చెప్పొచ్చు. అన్ని పనులు పూర్తిచేసుకుని దసరా కానుకగా అక్టోబర్ 5న భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతుంది. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.