Begin typing your search above and press return to search.

గాడ్‌ ఫాదర్ లో సల్మాన్‌.. మెగా ఫ్యాన్స్ ఫీలింగ్‌ ఇదేనట!

By:  Tupaki Desk   |   6 Oct 2022 8:30 AM GMT
గాడ్‌ ఫాదర్ లో సల్మాన్‌.. మెగా ఫ్యాన్స్ ఫీలింగ్‌ ఇదేనట!
X
మెగా స్టార్‌ చిరంజీవి గాడ్‌ ఫాదర్ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కు పాజిటివ్ టాక్ దక్కడం పట్ల ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో కీలక పాత్రలో నటించిన సల్మాన్ ఖాన్ గాడ్‌ ఫాదర్‌ సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్ దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. ఈ సినిమాలో సల్మాన్ పాత్రకు మిశ్రమ స్పందన వస్తోంది.

దర్శకుడు మోహన్ రాజా కావాలని మరీ ఈ సినిమాలో సల్మాన్‌ ఖాన్‌ తో నటింపజేశాడు అనేది చిరంజీవి మాట. గాడ్‌ ఫాదర్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో చిరంజీవి మాట్లాడుతూ సల్మాన్‌ ఖాన్‌ ను ఈ సినిమాలో నటింపజేయడం అనేది పూర్తి గా మోహన్‌ రాజా యొక్క నిర్ణయం గా చెప్పుకొచ్చిన విషయం తెల్సిందే. ఇప్పుడు ఆ నిర్ణయంను మెగా ఫ్యాన్స్ తప్పుబడుతున్నారు.

సినిమాలో చిరంజీవి మరియు సల్మాన్‌ ఖాన్ యొక్క ప్రజెన్స్‌ ఆకట్టుకుంది. కానీ సినిమా స్క్రీన్‌ ప్లే పీక్స్ లో ఉన్న సమయంలో సల్మాన్ ఖాన్‌ ఎంట్రీ ఇవ్వడం తో కాస్త డౌన్ అయ్యిందనే టాక్‌ వినిపిస్తుంది. సినిమాకు బజ్ తీసుకు వచ్చేందుకు ఇలాంటి గెస్ట్‌ అప్పియరెన్స్ ఏమాత్రం సరికాదు అంటూ ఈ సినిమాతో నిరూపితం అయ్యిందని కొందరు రివ్యూవర్స్ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సల్మాన్‌ తో క్లైమాక్స్ సినిమాకు మైనస్ గా కొందరు మెగా ఫ్యాన్స్ స్వయంగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు సల్మాన్‌ ఖాన్‌ ను జోకర్ గా చూపించి తప్పు చేశారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి మెగాస్టార్‌ చిరంజీవి యొక్క గాడ్‌ ఫాదర్‌ లో సల్మాన్ ఖాన్‌ లేకుండా ఉంటే ఇంకాస్త బెటర్ గా సినిమా ఉండేది అనేది మెగా ఫ్యాన్స్ అభిప్రాయం.

సినిమా లో సల్మాన్‌ ఖాన్‌ ఉండటం వల్ల బజ్ ఏమైనా పెరిగిందా అంటే అది కూడా లేదు అనేది కొందరి అభిప్రాయం. తెలుగు లో ఆడాలి అంటే చిరంజీవి కంటే ఎవరు ఉన్నా కూడా పెద్దగా ఉపయోగం లేదు అనేది ఫ్యాన్స్ యొక్క మాట. ఇదే సమయంలో సినిమాలో నయనతారను చిరుకు సోదరిగా చూడటం కూడా కాస్త ఇబ్బందిగా అనిపించిందని కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.

చిరంజీవి డాన్స్ ను మిస్ అయ్యాం అంటున్నారు. ఓవరాల్‌ గా సినిమాకు హిట్ టాక్ వచ్చినా కూడా ఇలాంటి చిన్న చిన్న అసంతృప్తి మాత్రం కామన్‌ గా వినిపిస్తుంది. ఇప్పుడు గాడ్‌ ఫాదర్‌ విషయంలో కూడా అదే జరుగుతుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.