Begin typing your search above and press return to search.

ఆమెకు ఇచ్చిన మాట నిలుపుకున్న సూపర్‌ స్టార్‌!

By:  Tupaki Desk   |   16 Oct 2019 1:30 AM GMT
ఆమెకు ఇచ్చిన మాట నిలుపుకున్న సూపర్‌ స్టార్‌!
X
బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ పైకి చాలా మొరటుగా.. కఠువుగా కనిపించినా కూడా ఆయన చాలా సున్నితం అంటూ ఆయనతో వర్క్‌ చేసిన చాలా మంది అంటూ ఉంటారు. ఆయన మంచి తనం మరియు సాయం చేసే గుణం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఒకసారి ఆయన ఎవరికైనా మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా ఆ మాట నిలుపుకుంటాడు. తనతో వర్క్‌ చేసిన ప్రతి ఒక్కరికి చాలా విలువ ఇవ్వడంతో పాటు వారికి చాలా ప్రాముఖ్యత ఇవ్వడం సల్మాన్‌ కు మొదటి నుండి ఉన్న మంచి గుణం అంటూ ఆయన అభిమానులు అంటూ ఉంటారు.

సల్మాన్‌ ఇటీవల 'భారత్‌' చిత్రంలో నటించిన విషయం తెల్సిందే. ఆ చిత్రంలో సెకండ్‌ హీరోయిన్‌ పాత్రకు గాను దీషా పఠాని నటించింది. ఆ సినిమాలో దిషా పాత్ర చాలా తక్కువ ఉంటుంది. అయినా కూడా సల్మాన్‌ తో నటించే ఉద్దేశ్యంతో ఆమె ఆ పాత్రకు ఓకే చెప్పింది. ఆ సమయంలోనే తన రాబోయే సినిమాల్లో ఏదో ఒక సినిమాలకు ఫుల్‌ లెంగ్త్‌ హీరోయిన్‌ పాత్ర ఇస్తానంటూ హామీ ఇచ్చాడు. ఇప్పుడు ఆ హామీని నెరవేర్చుకున్నాడు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సల్మాన్‌ ఖాన్‌ వచ్చే ఏడాది ప్రభు దేవా దర్శకత్వంలో చేయబోతున్న 'రాధే' చిత్రంలో హీరోయిన్‌ పాత్రకు గాను దిషా పఠాని ని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది రంజాన్‌ పండుగ సందర్బంగా రాధే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సల్మాన్‌ మరియు ప్రభుదేవా ఏర్పాట్లు చేస్తున్నారు. సల్మాన్‌ తో మరో సినిమా నటించబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా దిషా పఠాని బాలీవుడ్‌ లో బిజీ హీరోయిన్‌ అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.