Begin typing your search above and press return to search.

మాజీలు ఓడ్కా-సోడాలా మిక్స‌య్యారు!

By:  Tupaki Desk   |   3 Aug 2018 1:10 PM GMT
మాజీలు ఓడ్కా-సోడాలా మిక్స‌య్యారు!
X
కొంద‌రిని చూడ‌గానే పెర్ఫెక్ట్ పెయిర్ అని పొగిడేస్తాం. ఇదిగో ఇక్క‌డ క‌నిపిస్తున్న జంట ఆ త‌ర‌హానే. స‌ల్మాన్ ఖాన్‌- క‌త్రిన జంటగా క‌నిపిస్తే ఎంత క‌న్నుల పండువ‌గా ఉంటుందో.. ఇదిగో ఈ ఫోటోనే ఎగ్జాంపుల్‌. అయితే ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ఈ రేంజు కెమిస్ట్రీ సాధ్య‌మైంది? డీప్‌ గా డీటెయిల్స్‌ లోకి వెళితే..

కండ‌ల‌ హీరో స‌ల్మాన్ ఖాన్‌- క‌త్రిన‌ కైఫ్ స్నేహం గురించి ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నేలేదు. ఆ ఇద్ద‌రూ ఆల్వేస్ పెర్ఫెక్ట్ పెయిర్ అన‌డంలో సందేహం లేదు. ఆన్‌ స్క్రీన్ అయినా - ఆఫ్ ద స్క్రీన్ అయినా ఆ జంట చూడ‌ముచ్చ‌ట‌గా ఒక‌రికోసం ఒక‌రు పుట్టారేమో అన్న‌ట్టే క‌నిపిస్తారు. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా దాదాపు ఏడెనిమిదేళ్ల ప్రేమ త‌ర్వాత మ‌ధ్య‌లో ర‌ణ‌బీర్ ప్ర‌వేశించాడు. అది స‌ల్మాన్ భాయ్‌ కి ఊహించ‌ని ఉత్పాతం లాంటిది. ఆ క్ర‌మంలోనే క‌త్రిన త‌న‌కు దూర‌మై ర‌ణ‌బీర్‌ కి ద‌గ్గ‌ర‌వ్వ‌డం భాయ్‌ ని చాలానే డిస్ట్ర‌బ్ చేసింది. అటుపై స‌ల్మాన్ చూపు సింగ‌ర్ కం ఫ్యాష‌నిస్టా లులియా వాంటూర్ వైపు మ‌ర‌ళింది. ఏదైతేనేం.. లులియాతో కేవ‌లం స్నేహం మాత్ర‌మే కొన‌సాగిస్తున్నాడు. ఆ క్ర‌మంలోనే రీసెంటుగా క‌త్రిన త‌న బోయ్‌ ఫ్రెండ్ ర‌ణ‌బీర్‌ తో బ్రేక‌ప్ చెప్పి తిరిగి స‌ల్మాన్ చెంత‌కే చేరింది. ఇటీవ‌ల వ‌రుస‌గా అత‌డి స‌ర‌స‌న క్రేజీగా అవ‌కాశాలు అందుకుంటోంది. ఇదివ‌ర‌కూ స‌ల్మాన్ హీరోగా అలీ అబ్బాస్ జాఫ‌ర్ తెర‌కెక్కించిన `టైగ‌ర్ జిందా హై`లో క‌త్రిన క‌థానాయిక‌గా న‌టించింది. స‌ల్మాన్‌ కి ధీటుగా పోరాట స‌న్నివేశాల్లో న‌టించి మెప్పించింది. దాంతోపాటే భాయ్‌ తో రొమాన్స్ అంతే ఇరగ‌దీసింది. ఆ సినిమాలో పెర్ఫెక్ట్ క‌పుల్ అన్న ప‌దానికి అర్థం ఏంటో చూపించారు. ఇప్పుడు మ‌రోసారి అలీ అబ్బాస్ జాఫ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలోనే భ‌ర‌త్ అనే చిత్రంలో జంట‌గా న‌టిస్తున్నారు. రీసెంటుగానే ప్రియాంక చోప్రా ఎగ్జిట్‌ తో క‌త్రిన ఈ సినిమాకి సంత‌కం చేసింది.

రీసెంటుగానే ఓ ఈవెంట్‌ లో స‌ల్మాన్ - క‌త్రిన జోడీ ఇదిగో ఇలా జంట‌గా ద‌ర్శ‌న‌మిచ్చారు. భార్యాభ‌ర్త‌లు అంటే ఇలా ఉండాలి! అన్నంత స‌ర్‌ ప్రైజ్ ఇచ్చారు చూప‌రుల‌కు. స‌ల్మాన్ ఖ‌రీదైన డ్రెస్‌ లో పెళ్లికొడుకును త‌ల‌పిస్తే, ఆ ప‌క్క‌నే క‌త్రిన వైఫ్‌లా అల్లుకుపోయింది. రాకుమారుడు- రాకుమారి స్వ‌యం వ‌రంలో పాల్గొన్నంత‌గా త‌ళ‌త‌ళా మెరిసిపోయారు ఇద్ద‌రూ. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు అభిమానుల్ని మైమ‌రిపిస్తున్నాయి. మాస్ రాజాలు అయితే వోడ్కాలో సోడా మిక్సింగ్‌ లా క‌లిసిపోయారే! అంటూ త‌మ‌దైన శైలిలో పంచ్‌ లు వేసేంత‌గా ఉందీ లుక్‌. ఇంత‌కీ స‌ల్మాన్ - క‌త్రిన తిరిగి త‌మ బాంధ‌వ్యాన్ని కంటిన్యూ చేస్తున్న‌ట్టే భావించ‌వ‌చ్చా? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అయితే దీనిని భాయ్ కానీ, క‌త్రిన కానీ క‌న్ఫామ్ చేయాల్సి ఉందింకా.