Begin typing your search above and press return to search.

భాయ్‌ ని వేధిస్తున్న‌ కృష్ణ జింక‌

By:  Tupaki Desk   |   3 April 2019 6:21 AM GMT
భాయ్‌ ని వేధిస్తున్న‌ కృష్ణ జింక‌
X
కృష్ణ జింకల‌ వేట బాలీవుడ్ కండ‌ల హీరో స‌ల్మాన్ ఖాన్ కి ఇంకా త‌ల‌వంపులు తెస్తూనే ఉంది. 21 ఏళ్ల నాటి ఈ కేసులో ఇప్ప‌టికీ కోర్టుల చుట్టూ తిర‌గాల్సిన స‌న్నివేశం నెల‌కొంది. స‌ల్మాన్ పై నేడు కీల‌క‌మైన హైకోర్ట్ తీర్పు వెలువ‌డనుంద‌ని తెలుస్తోంది. నేడు జోధ్ పూర్ హైకోర్టులో స‌ల్మాన్ అప్పీల్ ప‌రిశీల‌నుకు రానుంది. ఇక స‌ల్మాన్ పై ఇదివ‌ర‌కూ లోక‌ల్ (సీజేఎం రూర‌ల్‌) కోర్టులో ప్ర‌తికూలంగా తీర్పు వెలువ‌డిన సంగ‌తి తెలిసిందే. ప‌లుమార్లు ఈ కేసు విష‌యమై స‌ల్మాన్ జోధ్ పూర్ సీజేఎం స్థానిక కోర్టులో విచార‌ణ‌కు ఎటెండ్ అయ్యారు. గ‌త ఏడాది స‌ల్మాన్ మిన‌హా ఈ కేసులో నిందితులుగా ఉన్న సైఫ్ అలీ ఖాన్, ట‌బు, సోనాలి బింద్రే, నీల‌మ్ కొథార్ ల‌కు రిలీఫ్ నిస్తూ కోర్టు తీర్పు వెలువ‌రించింది. స‌ల్మాన్ కి మాత్రం ఐదేళ్లు జైలు విధిస్తూ తీర్పు వెలువ‌డింది. అనంత‌రం స‌ల్మాన్ కింది కోర్టు తీర్పును జోధ్ పూర్ హైకోర్టులో ఛాలెంజ్ చేశారు.

కృష్ణ జింక‌ల్ని వేటాడిన ఘ‌ట‌న‌పై స‌ల్మాన్ గిల్టీగా ఫీల‌వ్వ‌డాన్ని గుర్తించామ‌ని గ‌త ఏడాది ఏప్రిల్ లో జ‌రిగిన విచార‌ణ‌లో సెష‌న్స్ కోర్టులో న్యాయ‌వాదులు పేర్కొన్నారు. తీర్పు వెలువ‌డిన అనంత‌రం స‌ల్మాన్ ఒక రోజంతా జైలు జీవితాన్ని గ‌డిపారు. అటుపై కింది కోర్టు తీర్పును హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో జోధ్ పూర్ హై కోర్టుకు విచార‌ణ నిమిత్తం స‌ల్మాన్ ఎటెండయ‌యారు. అప్ప‌ట్లోనే ఏప్రిల్ 3కి కేసును వాయిదా వేస్తున్నామ‌ని కోర్టు ప్ర‌క‌టించింది. నేడు మ‌రి కాసేప‌ట్లో ఈ కేసుకు సంబంధించి కీల‌క తీర్పు వెలువ‌డ‌నుంద‌ని తెలుస్తోంది.

కేసు పూర్వాప‌రాలు ప‌రిశీలిస్తే.. 1998లో `హ‌మ్ సాథ్ సాథ్ హై` చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో జోధ్ పూర్ ఔట్ స్క‌ర్ట్స్ లోని అడ‌విలో స‌ల్మాన్ భాయ్ కృష్ణ జింక‌ల వేట సాగించారు. ఆ స‌మ‌యంలో స‌ల్మాన్ తో పాటుగా సైఫ్ ఖాన్, ట‌బు, సోనాలి బింద్రే, నీలం అక్క‌డే ఉండ‌డంతో వీరంద‌రిపైనా కోర్టు విచార‌ణ సాగింది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్ష‌న్ లోని సెక్ష‌న్ 51 కింద ఈ కేసు విచార‌ణ సాగుతోంది. ఇన్ని వివాదాల న‌డుమ బ్యాడ్ బోయ్ స‌ల్మాన్ భాయ్ ఓవైపు బాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చిన తీరు.. కెరీర్ ని పీక్స్ కి తీసుకెళ్లిన తీరుపైనా అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. స‌ల్మాన్ న‌టించిన భ‌ర‌త్ ఈ ఏడాది రిలీజ్ కానుంది.