Begin typing your search above and press return to search.
సల్మాన్ కాపీ కొట్టేశాడా?
By: Tupaki Desk | 10 July 2015 10:30 AM GMTసంగీతం, సాహిత్యం పబ్లిక్ ప్రాపర్టీ కాదు. దాన్ని ఇష్టం వచ్చినట్టు వాడేస్తానంటే కుదరదు. అది క్రియేటివ్ ప్రాపర్టీ. కచ్ఛితంగా కొనుక్కున్న తర్వాతే ఇష్టానికి వినియోగించుకోవాలి. అది తెలిసీ చాలామంది కావాలనే తప్పులో కాలేస్తుంటారు. అలాంటి తప్పే సల్మాన్‌ఖాన్ అండ్ టీమ్ చేసి అడ్డంగా బుక్కయిపోయారు. ఈనెల 17న భజరంగి భైజాన్ రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఇంతలోనే కాపీ రైట్స్ అంటూ ఓ ఆసామి భజరంగి టీమ్‌ని రచ్చకీడ్చాడు. సల్మాన్, కబీర్‌ఖాన్, టీ సిరీస్ వాళ్లకు కోర్టు నోటీసులు పంపించాడు. వివరాల్లోకి వెళితే ...
బార్ దే జోలీ మేరీ యా మొహమ్మద్.. అంటూ సాగే ట్రెడిషనల్ కవ్వాళీ భక్తి పాటని భజరంగి చిత్రంలో ఉపయోగించారు. అయితే దీనికి అనుమతి తీసుకోలేదంటూ ముంబైకి చెందిన అబ్ధుల్ సమీ సిద్ధిఖీ కోర్టు కేసు వేశాడు. కాపీ రైట్స్ హక్కులు తమ వద్ద ఉన్నాయంటూ నోటీసులు పంపించాడు. వాస్తవానికి ఈ డివోషనల్ సాంగ్‌ని పాకిస్తాన్‌కి చెందిన షబ్రి బ్రదర్స్ 1975లో రూపొందించారు. 2007లో సదరు సిద్ధిఖీ హక్కులు చేజిక్కించుకున్నాడు. సబ్రి బ్రదర్స్‌తో ఒప్పందానికి సంబంధించిన ఓ పత్రాన్ని ఆధారంగా చూపించి ఇలా భజరంగి టీమ్‌పై విరుచుకుపడుతున్నాడు సిద్ధిఖీ. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుంటారో లేదో వేచి చూడాల్సిందే.