Begin typing your search above and press return to search.

బుట్టబొమ్మకు భాయ్ బర్త్ డే సర్‌ప్రైజ్

By:  Tupaki Desk   |   13 Oct 2022 8:13 AM GMT
బుట్టబొమ్మకు భాయ్ బర్త్ డే సర్‌ప్రైజ్
X
టాలీవుడ్ బుట్ట బొమ్మగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న పూజా హెగ్డే ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోని అత్యధిక పారితోషికం అందుకుఉంటున్న హీరోయిన్ లలో ఒకరు. పూజా అయితే గత రెండు మూడేళ్ల కాలం నుంచి వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతుంది. సక్సెస్ వచ్చిన ఫెయిల్యూర్ వచ్చిన కూడా ఆమెపై పెద్దగా ప్రభావం పడలేదు. ఒక సినిమా డిజాస్టర్ అయిన మళ్లీ మరొక సినిమాతో సక్సెస్ అందుకునే విధంగా కెరీర్ అయితే ప్లాన్ చేసుకుంటుంది.

ఇక నేడు పూజా హెగ్డే పుట్టినరోజు కావడంతో సినిమా ఇండస్ట్రీలో సినీ ప్రముఖులు అభిమానులు అందరూ కూడా సోషల్ మీడియా ద్వారా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ప్రత్యేకంగా సల్మాన్ ఖాన్ కూడా పూజా హెగ్డే పుట్టినరోజును సెలబ్రేట్ చేయడం విశేషం.

ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తో పూజ అయితే ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కిసి కా భాయ్ కీసి కి జాన్ అనే ఆ సినిమా లో టాలీవుడ్ హీరో వెంకటేష్ కూడా నటిస్తున్నాడు.

అలాగే జగపతిబాబు కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే పాటిస్తోంది. ఈ సినిమాతో ఎలాగైనా బుట్ట బొమ్మ బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా టాప్ హీరోయిన్గా బిజీ అవ్వాలని అనుకుంటుంది. అయితే ఈ క్రమంలో ఆమె పుట్టినరోజు కావడంతో సల్మాన్ భాయ్ ప్రత్యేకంగా ఆ సినిమా సెట్స్ లోనే కేక్ కట్ చేయించినట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన వీడియోను కూడా సల్మాన్ ఖాన్ టీం సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.

ఈ బర్త్ డే వేడుకలో పక్కనే విక్టరీ వెంకటేష్ కూడా ఉన్నాడు. ప్రత్యేకంగా ఆమెకు కేకు కూడా తినిపించిన వీడియో వైరల్ గా మారింది. ఇక పూజ అయితే హిందీలో ఈ సినిమాతో పాటు రన్వీర్ సింగ్తో సర్కస్ అనే మరొక సినిమా కూడా చేస్తోంది.

ఇక తెలుగులో అయితే మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూడు కూడా పెద్ద సినిమాలు కావడంతో రాబోయే రోజుల్లో బుట్ట బొమ్మ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకునే అవకాశం ఉంది. మరి ఆ సినిమాల తర్వాత అమ్మడి రేంజ్ ఇంకా ఏ స్థాయిలో పెరుగుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.