Begin typing your search above and press return to search.

విక్కీ-క్యాట్ పెళ్లికి స‌ల్మాన్ బాడీగార్డ్!

By:  Tupaki Desk   |   7 Dec 2021 4:31 AM GMT
విక్కీ-క్యాట్ పెళ్లికి స‌ల్మాన్ బాడీగార్డ్!
X
విక్కీ కౌశ‌ల్-క‌త్రినాకైఫ్ వివాహానికి రంగం సిద్ద‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. రాజాస్థాన్ లోని స‌వాయి మాధోపూర్ లోని సిక్స్ సెన్స్ పోర్ట్ బ‌ర్వారా ఇందుకు వేదిక అయింది. కుటుంబ స‌భ్యులు..అతికొద్ది మంది స‌న్నిహితులు..బాలీవుడ్ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో పెళ్లి నిరాడంబ‌రంగా జ‌రుగుతుంది. ఇప్ప‌టికే వ‌ధువ‌రూలు రాజస్థాన్ చేరుకున్నారు. అయితే ఈ పెళ్లికి క‌త్రినా మాజీ ప్రియుడు స‌ల్మాన్ ఖాన్ త‌ప్ప‌క హాజ‌ర‌వుతార‌ని మీడియా క‌థ‌నాలు అంత‌కంత‌కు వేడెక్కించాయి. కానీ ఆఛాన్స్ లేదు. స‌ల్మాన్ కి అహ్వానం అందిందా? లేదా? అన్న‌ది ప‌క్క‌న‌బెడితే విక్కీ క్యాట్ పెళ్లికి స‌ల్మాన్ అంత‌కు మించిన‌ బాధ్య‌త‌ల్ని నిర్వ‌ర్తిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఈ పెళ్లికి స‌ల్మాన్ బాడీ గార్డ్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. స‌ల్మాన్ సెక్యురిటీ సిబ్బంది మొత్తం పెళ్లి రోజున వేదిక వ‌ద్ద విధులు నిర్వ‌ర్తించ‌నున్న‌రని తెలుస్తోంది. స‌ల్మాన్ బాడీ గార్డ్ షేరా విక్కీ-క్యాట్ పెళ్లికి అవ‌స‌ర‌మైన భ‌ద్ర‌తా సిబ్బందిని ముంబై నుంచి పంపిస్తున్నారుట‌. స‌ల్మాన్ అదేశాల మేర‌కు షేరా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. పెళ్లి రోజు షేరా క‌త్రినా ప‌క్క‌నే ఉండాల‌ని ఆదేశాలిచ్చిన‌ట్లు స‌మాచారం. స‌ల్మాన్ టైగ‌ర్ సెక్యురిటీ పేరుతో సొంత ర‌క్ష‌ణ సిబ్బందిని క‌ల్గి ఉన్నాడు. కొన్నేళ్ల‌గా టైగ‌ర్ సెక్యురిటీ సంస్థ స‌ల్మాన్ కి ర‌క్ష‌ణ క‌ల్పిస్తుంది. షేరా దానికి నాయ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. షేరా స‌ల్మాన్ కి క‌ట్ట‌ప్ప‌లా న‌మ్మిన బంటు. అందుకే స‌ల్మాన్ పెళ్లికి హాజ‌రు కాక‌పోయినా క‌త్రినా కోసం క‌ట్ట‌ప్ప‌లాంటి షేరాని పంపిస్తున్నాడు.

ఇక స‌ల్మాన్ -కొన్న‌ళ్ల పాటు క‌త్రినా కైఫ్ తో రిలేష‌న్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రు క‌లిసి కొన్ని సినిమాలు చేసారు. మి గ‌తా హీరోయిన్ల‌కంటే స‌ల్మాన్ ఖాతాలో క‌త్రినా ఎక్కువ‌గానే ఫోక‌స్ అయింది. పెళ్లి కూడా చేసుకుంటార‌ని ప్ర‌చారం సాగింది. కానీ అంత వ‌ర‌కూ వెళ్ల‌లేదు. స‌ల్మాన్ తో బ్రేక‌ప్ త‌ర్వాత ర‌ణ‌బీర్ క‌పూర్ తో ప్రేమ‌లో ప‌డింది. అదీ కొన్నాళ్లే సాగింది. చివ‌రిగా విక్కీ కౌశల్ ని పెళ్లాడుతోంది.