Begin typing your search above and press return to search.
ఆ జాబితాలో భాయ్ కూడానా!
By: Tupaki Desk | 5 Jun 2019 7:43 AM GMTఆర్జీవీ నుంచి తేజ వరకూ.. సల్మాన్ నుంచి సన్యాసి వరకూ రివ్యూలు రాసేవాళ్లపై ఒకటే అభిప్రాయం. ఏదో మొహమాటానికి కొందరు పైకి అనరు కానీ రివ్యూ రైటర్లపై అందరిలోనూ ఒకటే ఆవేదన. వీళ్లు మొదటి రోజు మోర్నింగ్ షోకే రివ్యూలు రాసి మా సినిమాల్ని చంపేస్తున్నారు! అంటూ కలతకు గురవుతుంటారు. దర్శకదిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళి అంతటి వాడే బాహుబలి పై సమీక్షలు రాసిన వాళ్లపై ఫైరయ్యారు. సమీక్షకులపై మెజారిటీ పార్ట్ మేకర్స్ కి భిన్నాభిప్రాయాలున్నాయి. సమీక్షల వల్ల సినిమాలకు జనం రావడం లేదన్న ఆరోపణలు చేస్తున్నావారే ఎక్కువ మంది ఉన్నారు.
నేడు ప్రపంచవ్యాప్తంగా సల్మాన్ భాయ్ నటించిన `భారత్` రిలీజైంది. ఇప్పటికే సమీక్షకులు తమదైన శైలిలో రివ్యూలు ఇచ్చేశారు. అయితే తాజాగా ప్రచార కార్యక్రమాల్లో రివ్యూలు రాసే వాళ్లపై సల్మాన్ వేసిన వ్యాఖ్య హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ భాయ్ ఏమని పంచ్ వేశారు? అంటే .. మార్కెట్లో ఏదైనా బైక్ రిలీజైతే దానిపై రివ్యూలు రాసేందుకు కొన్ని రోజులు పడుతుంది. కనీసం అలా అయినా సినిమాల్ని వదిలేయొచ్చు కదా? మొదటి రోజే రివ్యూలు ఎందుకు? అంటూ సల్మాన్ క్లాస్ తీస్కున్నారు. 10 శాతం ఆడియెన్ రివ్యూలతో సెకండ్ ఒపీనియన్ కి వచ్చి థియేటర్లకు రావడం లేదు! అంటూ కాస్తంత సెటైరికల్ గానే అన్నారు. అయితే దీనికి రివర్స్ లో కౌంటర్లు అంతే ఇదిగా పడుతున్నాయి.
ఒకప్పటిలా సమీక్షలు అంటే రోజంతా వెయిట్ చేసి రాసే సీన్ లేదు. సినిమా లైవ్ లో ఉండగానే లైవ్ పాయింట్స్ ఆన్ లైన్ లో వచ్చేస్తున్నాయి. ట్విట్టర్ - ఇన్ స్టా- ఫేస్ బుక్ లో వన్ వర్డ్ రివ్యూలు.. వగైరా వగైరా రేటింగులతో పాటు వచ్చేస్తున్నాయి. నేరుగా ప్రేక్షకులే రివ్యూలు రాసేస్తున్నారు. రేటింగులు ఇచ్చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల యుగంలో `మై నే ప్యార్ కియా` రోజుల్ని తలుచుకుంటే కుదురుతుందా? భాయ్! ఇకపోతే కేవలం సినిమా రివ్యూలే కాదు.. ప్రపంచంలో ఎక్కడ ఏ ప్రొడక్ట్ రిలీజైనా వెంటనే వాటిపై వీడియో రివ్యూలు వచ్చేస్తున్నాయి. కొత్త బైక్ లేదా కొత్త కార్ ఏదైనా లాంచ్ అవుతోంది అంటే ఇంకా మార్కెట్లోకి రాకముందే ఫీచర్స్ పై రివ్యూలు రాస్తున్నారు. వీడియో రివ్యూలతో మోతెక్కిస్తున్నారు. కాబట్టి సల్మాన్ లాజిక్ వర్కవుట్ అవ్వదు. ఇక తొలి రోజు రివ్యూల వల్ల నిర్మాతలకు నష్టాలొస్తున్నాయని సల్మాన్ వ్యాఖ్యానించారు. అయితే చెత్త సినిమాలు తీసి జనాలపై రుద్దేయాలనుకునే ఏ నిర్మాతకైనా ఇది తప్పదు. రివ్యూ చదివి సినిమా చూడాలో లేదో నిర్ణయించుకునే హక్కు ప్రేక్షకులకు ఉంది కదా! వాళ్లను అలెర్ట్ చేయాల్సిన బాధ్యత రివ్యూ రైటర్లకు ఉంది. ఇకపోతే తన సినిమా `సీత`పై ఎంతో నమ్మకం పెట్టుకున్న తెలుగు దర్శకుడు తేజకు సైతం రివ్యూల పంచ్ లను ఎదుర్కోవాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. ఆర్జీవీ- పూరి లాంటి డైరెక్టర్లు రివ్యూలు రాసేవాళ్లపై తెరపైనే పంచ్ లు వేసిన సందర్భం ఉంది. వీళ్లకు రివర్స్ పంచ్ లు రివ్యూ రైటర్లు అంతే ఇదిగా తిరిగిచ్చేసిన సందర్భాల్ని తలుచుకోవాలి మరి.