Begin typing your search above and press return to search.

కాస్టింగ్ కౌచ్ గురించి నేనెప్పుడు వినలేదు

By:  Tupaki Desk   |   2 Dec 2017 9:44 AM GMT
కాస్టింగ్ కౌచ్ గురించి నేనెప్పుడు వినలేదు
X

ఎప్పుడైతే హాలీవుడ్ లో ఓ నిర్మాత హీరోయిన్స్ ని వేధిస్తున్నాడనే విషయాలు బయటపడ్డాయో అప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా కాస్టింగ్ కౌచ్ అనే పదం హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలలో చాలా మంది హీరోయిన్స్ వేధింపులకు గురయ్యామని చెప్పారు. అంతే కాకుండా కాస్టింగ్ కౌచ్ గురించి కూడా చెప్పారు. పక్కలోకి వస్తేనే మొదటి అవకాశాలు దక్కుతాయి. అలాగే కెరీర్ డౌన్ లో ఉన్నప్పుడు ఒకరితో పడుకోక తప్పదని చెప్పిన హీరోయిన్స్ చాలా మందే ఉన్నారు.

గతంలో కొన్ని ఉదంతాలు కూడా చాలానే వచ్చాయి. కానీ ఈ మధ్య కాలంలో అలాంటి ఘటనలు జరగకపోయినా కూడా కాస్టింగ్ కౌచ్ తెరవెనుక బాగా నడుస్తోందని ముఖ్యంగా బాలీవుడ్ లో కొనసాగుతున్నాయి అని పలువురు నటి నటులు ఆరోపించడం కొందరికి నచ్చడం లేదు. ఇకపోతే రీసెంట్ గా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఈ విషయంపై స్పందించాడు. ఢిల్లీలో జరిగిన లీడర్ షిప్ సమ్మిట్ లో పాల్గొన్న సల్మాన్ కాస్టింగ్ కౌచ్ ప్రస్తావన రాగానే కొంచెం ఘాటుగానే సమాధానం ఇచ్చాడు.

పక్కలోకి వస్తావా.. ఛాన్స్ ఇస్తాను అనడం నిజంగా దారుణం. కానీ నేనెప్పుడూ ఇలాంటివి బాలీవుడ్ లో వినలేదు. ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నాం. మా నాన్న కూడా చాలా కాలం నుంచి ఇండస్ట్రీలో ఉంటున్నారు. కానీ మేము ఇప్పుడు పక్కలోకి వస్తావా, కాస్టింగ్ కౌచ్ అనే పాదాలను వినలేదు. కానీ అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి కొంతమంది ప్రయత్నం చేస్తుంటారు. కానీ దానికి వేరే పద్ధతి ఉంది. కాస్టింగ్ కౌచ్ పరిణామాలు ఇక్కడ జరగవు. అలాంటి వారు కూడా ఇక్కడ లేరని చెబుతూ.. ఎవరైనా కాస్టింగ్ కౌచ్ జరుగుతోంది అని మాట్లాడితే కౌంటర్ ఇస్తానని కండల వీరుడు వివరణ ఇచ్చాడు.

కానీ బాలీవుడ్ అడ్డాలో కాస్టింగ్ కౌచ్ పరిణామాలు ఇంతకుముందు చాల చోటు చేసుకున్నాయి. రెండ్ హ్యాండెడ్ గా దొరికిన వారు కూడా ఉన్నారు. ఎన్నో కేసులు కూడా నమోదు అయ్యాయి. అయితే చిత్ర పరిశ్రమలో ఏం జరుగుతుందో ఒక స్టార్ హీరోకి తెలియకుండా అస్సలు ఉండదు. కానీ సల్మాన్ ఈ విధంగా స్పందించడం చూస్తుంటే.. కాస్త డౌట్ గానే ఉంది మరి.