Begin typing your search above and press return to search.
లాభాల్లో 70% కావాలట
By: Tupaki Desk | 15 Sep 2017 1:28 PM GMTకాలం ముందుకు సాగుతున్న కొద్దీ ప్రతి విషయంలోను కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. వాడు ఎలా ఉంటాడు అనడం కన్నా ఎంత సంపాదించాడు అనేదే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. మనిషి మనస్సులో మంచితనం ఉన్నా మనీ మీద మాత్రం మక్కువ తగ్గట్లేదు. దీంతో అవకాశం ఉన్నప్పుడే ఉహకందని డబ్బును మనిషి సంపాదించుకోవాలని తపనపడుతున్నాడు. ముఖ్యంగా కొంత మంది సినిమా హీరోలైతే తెరపై డబ్బు శాశ్వతం కాదని.. తెరవెనుక మాత్రం సింగిల్ రూపాయిని కూడా వదలడం లేదు.
మొన్నటి వరకు హీరోలు ఒక ఫిక్సిడ్ రెమ్యునరేషన్ ని తీసుకునేవారు. కానీ నిర్మాతలు లాభాలని పదింతలు అందుకుంటున్నారని లాభాల్లో వాటాలు ఇవ్వమని అంటున్నారు. మరికొందరైతే ఓ ఏరియా మొత్తం హక్కులను ఇవ్వమని అంటున్నారు.ముఖ్యంగా బాలీవుడ్ హీరోలైతే నిర్మాతలకు దిమ్మ తిరిగేలా షాక్ ఇస్తున్నారట. లాభాల్లో ఊహకందని వాటాను అడుగుతున్నారట. ఇప్పుడు అదే తరహాలో సల్లు బాయ్ కూడా ప్రవర్తిస్తున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ హీరో సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షాన్ని కురిపిస్తున్నాయి. పెట్టున పెట్టుబడికి పదింతలు రావడంతో నిర్మాతల నుండి వాటాలను గుంజుతున్నాడట. బాలీవుడ్ లో బారి తారాగణంతో తెరకెక్కబోయే రేస్ సినిమాలో నటించడానికి సల్మాన్ వచ్చే లాభాల్లో 70% వాటాను అడుగుతున్నాడని టాక్ వినిపిస్తోంది. నిర్మాత ఎంతో కష్టపడి లాభ నష్టాలను లెక్క చేయకుండా వందల కోట్లు పెట్టుబడి పెడితే దాని గురించి ఆలోచించకుండా లాభాలు వస్తే ఆ మొత్తం ఇవ్వాలని అడగడం న్యాయమేనా అంటున్నారు సినీ విశ్లేషకులు.
రీసెంట్ గా సల్లూ బాయ్ అత్యాశకు పోయి ట్యూబ్ లైట్ లాంటి సినిమాను తానే నిర్మించుకున్నాడు. ఆ ట్యూబ్ లైట్ కాస్త వెలగకపోవడంతో బయ్యర్స్ నస్టపోయారు. కానీ సల్లు మంచి మనసుతో 50 కోట్లను తిరిగి ఇచ్చేశాడు. కానీ ఇప్పుడు మాత్రం రేస్ 3 సినిమా ఎలాగైనా హిట్ అవుతుందని నమ్మకంతో గట్టిగా అందుకోవాలని డిసైడ్ అయ్యాడట. మరి ప్రొడ్యూసర్స్ ఒకేసారి 70% శాతాన్ని ఇస్తారో లేక వేరే హీరోని వెతుకుంటారో చూడాలి.