Begin typing your search above and press return to search.

సల్మాన్ పై చెలరేగిపోయిన మాజీ ప్రేయసి..!

By:  Tupaki Desk   |   3 Dec 2022 7:43 AM GMT
సల్మాన్ పై చెలరేగిపోయిన మాజీ ప్రేయసి..!
X
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఎప్పుడూ ఏదో ఒక వివాదాలతో వార్తల్లో నిలుస్తాడు. తనకు సంబంధం లేకపోయినా సరే కొన్నిసార్లు సల్మాన్ ఖాన్ హెడ్ లైన్స్ లో ఉంటాడు. లేటెస్ట్ గా తనతో కొన్నాళ్లు డేటింగ్ చేసి తర్వాత దూరమైన సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసి సోమీ అలి మరోసారి అతని పై విరుచుకు పడ్డది. 1993లో అవతార్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సోమీ అలి ఆ టైం లోనే సల్మాన్ కు దగ్గరైంది. దాదాపు ఏడు ఎనిమిదేళ్లుగా వీరు సహజీవనం చేశారు.

అప్పట్లో సల్మాన్, సోమి అలిల రిలేషన్ పై మీడియాలో వార్తలు వచ్చాయి. మొదట్లో వారు కూడా సమాధానాలు చెప్పినా ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. అతనితో ఉన్న టైం ను గుర్తు చేసుకుంటూ సల్మాన్ ఒక ఉన్మాది.. ఉమెన్ బీటర్ అని.. తనని ఎన్నోసార్లు సిగరెట్ తో కాల్చాడని.. లైంగికంగా వేధించాడని ఇన్ స్టాగ్రాం లో పోస్ట్ పెట్టింది సోమీ అలి.

సోమీ అలి కొద్దిసేపటికే ఇన్ స్టా పోస్ట్ డిలీట్ చేసినా అప్పటికే అది వైరల్ గా మారింది.

పాకిస్తానీ అమ్మాయి అయిన సోమీ అలి అమెరికాలో సెటిల్ అయ్యింది. 1997 లోనే బాలీవుడ్ కి గుడ్ బై చెప్పి అమెరికా వెళ్లిపోయింది. సల్మాన్ ఖాన్ ఆమెతోనే కాదు బాలీవుడ్ లో చాలామంది హీరోయిన్స్ తో ఎఫైర్స్ నడిపించాడు. సోమీ అలితో కూడా సల్మాన్ కొన్నాళ్లు రిలేషన్ లో ఉన్నాడు. అతని టార్చర్ భరించలేక ఆమె సినిమాలని వదిలేసి కూడా వెళ్లిందని అప్పట్లో టాక్.

56 ఏళ్ల సల్మాన్ ఖాన్ ఇప్పటికీ బ్యాచిలర్ గానే ఉన్నాడు. పెళ్లి ఆలోచన ఎప్పుడో వదిలేసిన సల్మాన్ ఖాన్ బాలీవుడ్ హీరోయిన్స్ తో సహజీవనం మాత్రం చేశాడు.

అయితే ఇన్నేళ్ల తర్వాత సోమీ అలి మళ్లీ సల్మాన్ పై ఆ కామెంట్స్ చేయడం వెనుక రీజన్స్ ఏంటన్నది తెలియాల్సి ఉంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సల్మాన్ ఖాన్ ని కొన్ని వివాదాలు ఎప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.