Begin typing your search above and press return to search.

మీ సాయానికి థ్యాంక్స్‌.. టీ కొనుక్కుంటా

By:  Tupaki Desk   |   26 March 2018 12:20 PM GMT
మీ సాయానికి థ్యాంక్స్‌.. టీ కొనుక్కుంటా
X
వీర్‌ గాటీ చిత్రంలో స‌ల్మాన్‌ ఖాన్ స‌ర‌స‌న న‌టించిన బాలీవుడ్ హీరోయిన్ పూజా ద‌ద్వాల్ దిక్కుతోచ‌ని స్థితిలో అనారోగ్యంతో ఉన్న వార్త మీడియాలో క‌ల‌క‌లం రేపింది. దీంతో వెంట‌నే స్పందించిన స‌ల్మాన్ ఖాన్‌ - త‌న స‌హ న‌టి కోలుకోడానికి అవ‌స‌ర‌మైన సాయం చేసేందుకు ముందుకొచ్చాడు. ఆయ‌న‌తో పాటు సినీ - టెలివిజ‌న్ ఆర్టిస్టుల అసోషియేష‌న్ సింటా కూడా ఆర్థిక సాయం చేయ‌డానికి ముందుకు రావ‌డంతో ప్ర‌స్తుతం ఆమె ప్రైవేటు ఆసుపత్రికి మార్చ‌బ‌డి - కోలుకుంటోంది.

పూజా ద‌ద్వాల్ క్ష‌య వ్యాధి బారిన ప‌డి - నా అనే వాళ్లు కూడా ప‌ట్టించుకోక దుర్భ‌ల స్థితిలో ప‌డింది. ఆర్థికంగా చితికిపోయి - శారీర‌కంగానూ బ‌ల‌హీన‌ప‌డిన పూజా ద‌ద్వాల్‌ ను ఆమె స్నేహితులు కొంద‌రు - సాయం కోసం వీడియో ద్వారా సినిమా ఇండ‌స్ట్రీ పెద్ద‌ల‌ను వేడుకోమ్మ‌ని చెప్పార‌ట‌. వారి స‌ల‌హాను స్వీక‌రించిన పూజా - అలాగే చేసింది. ఆమె వీడియో వైర‌ల్ కావ‌డంతో స‌ల్మాన్‌ తో పాటు చాలామంది దాత‌లు ఆమెకు సాయం అందించేందుకు ముందుకొచ్చారు. దీంతో ప్ర‌స్తుతం ప్రైవేటు ఆసుపత్రిలో కోలుకుంటున్న ఆమె మీడియాతో మాట్లాడింది. ‘‘ఎట్ట‌కేల‌కు నేను ప్రైవేటు ఆసుప‌త్రికి వెళుతున్నాను. కొన్ని రోజుల్లోనే నా కాళ్ల మీద నేను నిల‌బ‌డ‌తానేమో. మ‌రికొన్ని వారాల్లో టీ కొనుక్కోగ‌లుగుతానేమో... నాకు సాయం చేసిన మంచి వాళ్లంద‌రికీ థ్యాంక్స్‌’’ అని చెప్పిందామె.

బీజ్‌ పూరీ - హిందీ న‌టుడు ర‌వికిష‌న్ కూడా పూజాకు సాయం చేసేందుకు ముందుకొచ్చాడు. ఆమె రోజువారీ ఖ‌ర్చుల‌కు ప్ర‌తి నెలా కొంత మొత్తం పంపేందుకు టెలివిజ‌న్ ఆర్టిస్టులు అసోసియేష‌న్ సింటా నిర్ణ‌యం తీసుకుంది. ఆమె త్వ‌ర‌గా కోలుకుని మ‌ళ్లీ ఆరోగ్యంగా కనిపించాల‌ని అంద‌రూ కోరుకుంటున్నారు.