Begin typing your search above and press return to search.
పాన్ ఇండియాపై కండల హీరో కన్ను
By: Tupaki Desk | 24 Oct 2019 11:07 AM GMTకండల హీరో సల్మాన్ ఖాన్ వ్యవహారం చూస్తుంటే తేడాగానే కనిపిస్తోంది. భాయ్ మైండ్ సెట్ మారిందని తన మాటల్ని బట్టి స్పష్టంగా అర్థమైంది. ప్రస్తుతం సల్మాన్ దృష్టి పాన్ ఇండియాపై పడిందని అర్థమవుతోంది. ఓవైపు సౌత్ దూసుకొస్తుంటే ముంబై పరిశ్రమ ఈ విషయంలో వెనకబడిందన్న ఆలోచన భాయ్ కి ఉంది. ఇక్కడ ప్రభాస్ నటించిన సినిమాలు తెలుగు-తమిళం ను మించి హిందీలో రిలీజవుతున్నాయి. అక్కడ బంపర్ హిట్లు కొడుతున్నాయి. సరిగ్గా ఇదే పాయింట్ అతడి మైండ్ సెట్ ని మార్చేసింది.
ప్రస్తుతం దబాంగ్ 3 ప్రమోషన్స్ కోసం అటు ముంబై సహా ఇటు హైదరాబాద్- చెన్నయ్- బెంగళూరు వంటి చోట్ల భారీగా టూర్లతో ప్రచారం చేస్తున్నాడు. నిన్న ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో భాయ్ అన్న మాటలు తూటాల్లా సూటిగా దూసుకుపోయాయి. నా సినిమాల్లో ప్రేమ్ రతన్ ధన్ పాయో సహా కొన్ని చిత్రాల్ని సౌత్ భాషల్లో రిలీజ్ చేస్తే అక్కడ రూ.1-2 కోట్లు మాత్రమే వసూలు చేశాయి. అందుకే ఇప్పుడు దబాంగ్ 3ని పాన్ ఇండియా సినిమాగా తయారు చేసి వదులుతున్నా. ఈ సినిమాలో లార్జర్ దేన్ లైఫ్ పాత్రలో కనిపిస్తాను. అది సౌత్ లో నచ్చుతుంది! అంటూ భాయ్ అన్నారు. సౌత్ సినిమాలు బాహుబలి -కేజీఎఫ్- సైరా నరసింహారెడ్డి ఇక్కడ రిలీజై హిట్టు కొట్టాయి. మా సినిమాల్ని అక్కడ హిట్టు చేయనివ్వండి అని అన్నారు సల్మాన్. 20 డిసెంబర్ కోసం ఎంతో ఎగ్జయిటింగ్ గా వేచి చూస్తున్నానని అన్నారు.
2017లో వరుసగా కొన్ని ఫ్లాప్ సినిమాల్లో నటించిన భాయ్ అనంతరం `టైగర్ జిందా హై` చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ట్యూబ్ లైట్- రేస్ 3 లాంటి భారీ చిత్రాలు డిజాస్టర్లు అయ్యాయి. ఆ తర్వాత భారత్ చిత్రం అట్టర్ ఫ్లాపైంది. ఆ సినిమాలపై ఫిలింక్రిటిక్స్ తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. అందుకే క్రిటిక్స్ ని ఉద్ధేశించి మాట్లాడుతూ భాయ్ చెణుకులు విసిరాడు. దబాంగ్ 3 చిత్రానికి స్క్రిప్టు నేనే రాశాను. మీరు నన్నే తిట్టాల్సి ఉంటుందని అన్నాడు సల్మాన్. ఈ సినిమా క్రిటిక్స్ కోసమే అంటూ సరదాగా జోకులేస్తూ నవ్వేశాడు. ఈ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న వస్తున్న దబాంగ్ 3కి చాలా ముందు నుంచి ప్రచారం చేస్తూ వేడెక్కిస్తున్నాడు సల్మాన్. దీనిని పాన్ ఇండియా లెవల్లో హిట్టు చేయాలన్నది భాయ్ ప్లాన్. ఈ కార్యక్రమంలో దర్శకుడు ప్రభుదేవా- ఆర్భాజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.