Begin typing your search above and press return to search.

స‌ల్మాన్ లాగా చిరంజీవి ర‌జ‌నీ చేయ‌లేదేం?

By:  Tupaki Desk   |   11 May 2020 5:50 AM GMT
స‌ల్మాన్ లాగా చిరంజీవి ర‌జ‌నీ చేయ‌లేదేం?
X
కండ‌ల హీరో సల్మాన్ ఖాన్ ఏం చేసినా సంథింగ్ స్పెష‌ల్ గానే ఉంటుంది. గ‌త 40రోజులుగా లాక్ డౌన్ ని ఆయ‌న ఎక్క‌డ గ‌డిపారో చూస్తున్న‌దే. ఆయ‌న ముంబై ఔట‌ర్ లోని 150 ఎక‌రాల ఫామ్ లో త‌న కుటుంబ స‌భ్యులు స్నేహితుల‌తో గ‌డుపుతున్నారు. ఫామ్ హౌస్ డైరీ పేరుతో ఇప్ప‌టికే ప‌లువురు క‌థానాయిక‌ల‌తో స‌ల్మాన్ భాయ్ దిగిన ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి. ఇక స‌ల్లూ డియ‌రెస్ట్ ఫ్రెండ్ జాక్విలిన్ ఫెర్నాండెజ్ అయితే గుర్ర‌పు స్వారీ నేర్చుకుని గుర్ర‌పు సాల‌లో ప‌ని చేస్తున్న ఫోటోలు వీడియోలు అంత‌ర్జాలాన్ని హీటెక్కించాయి. స‌ల్మాన్ ఈ ఫామ్ హౌస్ లో ఒక గుర్ర‌పు సాల‌ను మెయింటెయిన్ చేస్తున్నారు. ఫామ్ లో వీటిపైనే సంచ‌రిస్తుంటారు.

పన్వెల్ ఫామ్ హౌజ్ అని ఈ తోట‌ను పిలుస్తుంటారు. అర్పితా ఫార్మ్స్ అని కూడా పిలుస్తార‌ట‌. అర్పిత స‌ల్మాన్ సోద‌రి. సోద‌రి అంటే అత‌డికి అంత ఇష్టం. అందుకే తోట‌కు ఆ పేరు పెట్టేశార‌ట‌. ప్ర‌స్తుతం ఈ తోట‌లో స‌ల్మాన్ త‌ల్లి గారు స‌హా సోద‌రి అర్పిత‌.. బావ‌మ‌రిది ఆయుష్ .. మేన‌ల్లుడు అహిల్.. మేనకోడలు అయత్ వీళ్లంద‌రితో కలిసి ఎక్కువ సమయం గడుపుతున్నారు. వారితో కలిసి ఆటలాడుకుంటూ ఫామ్ హౌజ్ పరిసరాల్లో టైమ్ స్పెండ్ చేస్తున్న ఫోటోలు ఇప్ప‌టికే వైర‌ల్ అవుతున్నాయి. ఈ ఫామ్ హౌస్ ఒక బిగ్ బాస్ హౌస్ లా ఉంద‌ని స‌ల్మాన్ ఛ‌మ‌త్క‌రించడం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. అంతేకాదు .. ఇక్క‌డికి త‌న క్లోజ్ ఫ్రెండ్స్ అంద‌రినీ భాయ్ ఆహ్వానించాడ‌ట‌. ప్ర‌స్తుత‌ క్వారంటైన్ స‌మ‌యంలో అక్క‌డి అందాల్ని ఫోటోల రూపంలో స‌ల్మాన్ భాయ్ - జాక్విలిన్ షేర్ చేస్తూనే ఉన్నారు.

ఈ ఫామ్ హౌజ్ నుంచే బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ కి సంబంధించిన కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా కరోనా లాక్ డౌన్ స‌మ‌యంలో పేద‌ల‌కు నిత్యావ‌స‌రాల్ని ఇక్క‌డి నుంచే పంపించారు. 25వేల మంది కార్మికులకు రోజువారీ నిత్యావసరాలను అందించారు. ట్రాక్ట‌ర్లు.. బండ్ల‌లో వీటిని స‌ర‌ఫ‌రా చేశారు. #బీయింగ్ హంగ‌రీ.. పేరుతో భోజన ట్రక్కుల్లో ఆహారాన్ని స‌ర‌ఫ‌రా చేస్తున్నారు. ఆ ట్ర‌క్ ల వీడియోల్ని స‌ల్మాన్ స్నేహితుడు శివసేన చీఫ్ రాహుల్ కనాల్ ట్విట్టర్ లో షేర్ చేస్తూ సల్మాన్ ఖాన్ ధ‌న్య‌వాదాలు తెలిపారు. ప్ర‌స్తుత క్రైసిస్ లో జాక్వెలిన్ ఫెర్నాండేజ్- లులియా వాంటర్ త‌దిత‌రులు బోలడంత సాయ‌ప‌డ్డార‌ట‌.

అన్న‌ట్టు స్టార్ల‌ ఫామ్ హౌస్ ల గురించి ముచ్చ‌టిస్తే... బెంగ‌ళూరు(క‌ర్నాట‌క‌) - త‌మిళనాడు బార్డ‌ర్ లో కొన్ని ఎక‌రాల్లో ఫామ్ హౌస్ లు ఉన్న స్టార్ల‌లో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. సూపర్ స్టార్ ర‌జ‌నీకాంత్ పేర్లు ఉన్నాయి. ఈ ఫామ్ హౌస్ లు వ‌న్య ప్రాణులు సంచ‌రించే భారీ అట‌వీ ప్రాంతానికి స‌మీపంలో ఉన్నాయ‌ని అక్క‌డ విజిట్ చేసిన టూరిస్టులు చెబుతుంటారు. అయితే క్వారంటైన్ స‌మ‌యంలో చిరు కానీ ర‌జ‌నీ కానీ ఫామ్ హౌస్ ల జోలికి పోలేదు ఎందుక‌నో! వీరంతా ఇండ్ల‌లోనే ఉండి స‌మ‌యాన్ని స్పెండ్ చేస్తున్నారు. చిరు సీసీసీ ట్ర‌స్ట్ ద్వారా పేద కార్మికుల‌కు సాయం చేయ‌డ‌మే గాక ప్ర‌భుత్వాల‌కు విరాళాలు పంపారు. ర‌జ‌నీ సైతం ప్ర‌భుత్వానికి పెద్ద మొత్తంలో నిధి సాయం చేశారు. పేద సినీకార్మికుల్ని ఆదుకునే ప్ర‌య‌త్నం చేశారు.