Begin typing your search above and press return to search.
'సల్మాన్ ఖాన్ నా కాళ్లు పట్టుకుని వద్దన్నా ఊరుకోను'
By: Tupaki Desk | 29 May 2021 3:30 AM GMTబాలీవుడ్ లో అత్యంత వివాదాస్పద వ్యక్తిగా క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ కి పేరుంది. ఒకటీ అరా సినిమాలు చేసిన ఈ ఖాన్.. ఆ తరువాత సినిమాల రివ్యూస్ చేస్తూ రచ్చ చేస్తూ వస్తున్నాడు. అక్కడితో ఆగకుండా ఇండస్ట్రీ ప్రముఖుల మీదా.. సినిమాలపైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు. హీరో హీరోయిన్ల వ్యక్తిగత విషయాలు ఎఫైర్స్ ప్రస్తావిస్తూ నోటికొచ్చినట్లుగా మాట్లాడుతుంటాడు. సౌత్ ఇండియా యాక్టర్స్ పై.. సినిమాలపైనా బ్యాడ్ కామెంట్స్ చేసి, అభిమానులు కౌంటర్ అటాక్ చేయడంతో క్షమాపణలు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు కమల్ ఆర్ ఖాన్ పై బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు కోపమొచ్చింది. దీంతో ఏకంగా అతనిపై పరువునష్టం దావా వేశారు సల్మాన్.
వివరాల్లోకి వెళ్తే.. కండల వీరుడు సల్మాన్ - డైరెక్టర్ ప్రభుదేవా కాంబినేషన్ లో తెరకెక్కిన 'రాధే' సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ప్రేక్షకుల నుంచి విశ్లేషకుల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. సినిమా అస్సలు బాగాలేదని సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ చేశారు. అయితే అందరినీ లైట్ తీసుకున్న సల్లూ భాయ్.. 'రాధే' ని సమీక్షించిన కమల్ ఆర్ ఖాన్ ని మాత్రం పట్టించుకున్నాడు. ఎందుకంటే కేఆర్కే రివ్యూ ఆ రేంజ్ లో ఉంది. సినిమా బాగాలేదని చెప్తే సల్మాన్ ఫీల్ అయ్యేవాడు కాదేమో.. కానీ కండల వీరుడ్ని పట్టుకొని 'కరప్ట్' అంటూ ఆరోపించాడు. అంతటితో ఆగకుండా సల్మాన్ కు చెందిన 'బీయింగ్ హ్యూమన్' గురించి నోటికొచ్చినట్లు మాట్లాడాడు. దీంతో సల్మాన్ కు కోపమొచ్చి క్రిటిక్ కి లీగల్ టీమ్ ద్వారా పరువు నష్టం దావా నోటీసులు పంపించాడు.
అయినా సరే వెనక్కి తగ్గని కమాల్ ఖాన్.. 'రాధే' రివ్యూ చేసినందుకే తనని టార్గెట్ చేస్తున్నారని అంటున్నాడు. బాలీవుడ్ లో అత్యంత నిజాయితీపరుడైన క్రిటిక్ తానే నని.. అందుకే తన రివ్యూలంటే భయపడిపోతున్నారని చెబుతున్నాడు. 'రాధే' సినిమా బాగాలేదని సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్ కూడా అన్నాడని పేర్కొన్నాడు. ఈ క్రమంలో తనదైన శైలిలో రెచ్చిపోతూ ''సల్మాన్ ఖాన్ వచ్చి నా కాళ్లు పట్టుకుని వద్దన్నా కూడా ఇక మీద ఊరుకోను.. ఆయన సినిమాల్ని నేను రివ్యూ చేస్తూనే ఉంటాను'' అని కమల్ ఆర్ ఖాన్ అన్నాడు. 'రాధే' సినిమాని అందరూ ఎప్పుడో మర్చిపోతే.. కమాల్ ఆర్ ఖాన్ రచ్చ దెబ్బతో మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు.