Begin typing your search above and press return to search.
ఫైనల్ గా పెళ్లి గురించి సల్మాన్ మాట ఇదే
By: Tupaki Desk | 4 Jun 2019 9:27 AM GMTఅయిదు పదుల వయసు దాటి నాలుగు సంవత్సరాలు అయినా కూడా సల్మాన్ ఖాన్ ఇంకా పెళ్లి ప్రస్థావన మాత్రం తీసుకు రావడం లేదు. గత రెండు మూడు దశాబ్దాలుగా సల్మాన్ ఖాన్ పెళ్లి గురించిన వార్తలు, పుకార్లు మీడియాలో వస్తూనే ఉన్నాయి. అదుగో సల్మాన్ పెళ్లి ఇదుగో ఆయన ప్రేమ అంటూ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. కాని ఇప్పటి వరకు సల్మాన్ మాత్రం పెళ్లి చేసుకోలేదు. తాజాగా 'భారత్' చిత్రంలో నటించిన సల్మాన్ ఖాన్ ఆ సినిమాను ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. ఆ సందర్బంగా సినిమా ప్రమోషన్ కోసం ఒక ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చాడు.
ఆ ఇంటర్వ్యూలో పెళ్లిపై క్లారిటీగా మాట్లాడాడు. జీవితంలో తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్పేశాడు. పెళ్లి చేసుకుంటే జీవితం అక్కడితో ఆగిపోతుందని.. జీవితం కెరీర్ అక్కడ నుండి పతనం అవుతుందని అన్నాడు. పెళ్లి చేసుకుంటే నా జీవితం కెరీర్ మరింత బాగు పడుతుందని నేను అనుకోవడం లేదు. అందుకే నాకు పెళ్లి అవసరం అనిపించడం లేదని సల్మాన్ చెప్పుకొచ్చాడు. సల్మాన్ మాటలు చూస్తుంటే ఆయన భవిష్యత్తులో కూడా పెళ్లి చేసుకోడేమో అనిపిస్తుంది.
పెళ్లి చేసుకోకుంటే మీ కంటూ వారసులు ఉండరు కదా అంటూ జర్నలిస్ట్ ప్రశ్నించిన సమయంలో అది జరగాల్సిన సమయంలో జరిగి పోతుందంటూ వేదాంత దోరణిలో మాట్లాడాడు. మొత్తానికి సల్మాన్ ఖాన్ కు అసలు పెళ్లిపై ఏమాత్రం ఆసక్తి లేదని తేలిపోయింది. ప్రస్తుతం ఈయన కత్రీనా కైఫ్ తో డేటింగ్ లో ఉన్నట్లుగా బాలీవుడ్ వర్గాల్లో పుకార్లు గుప్పుమంటున్నాయి. మరి ఈమెతో రిలేషన్ ఎన్నాళ్లు సాగిస్తాడో చూడాలి.