Begin typing your search above and press return to search.
నేను ఇంట్లో లేను ఎవరు రావద్దు
By: Tupaki Desk | 27 Dec 2020 1:45 PM ISTబాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్బంగా ప్రతి ఏడాది ఆయన ఇంటి వద్దకు వేలాది మంది అభిమానులు తరలి వస్తూ ఉంటారు. వారికి కనిపించి వారితో కొద్ది సమయం సల్మాన్ గడుపుతూ ఉంటాడు. కాని ఈసారి అలాంటి పరిస్థితులు లేవు. తాను అపార్ట్ మెంట్ లో లేను మీరు ఎవరు కూడా ఇంటికి రావద్దంటూ సల్మాన్ ఖాన్ అభిమానులకు సందేశాన్ని ఇచ్చాడు. ఈ సమయంలో ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించడంతో పాటు మాస్క్ మరియు శానిటైజర్స్ ను తప్పనిసరిగా వినియోగించాంటూ సూచించాడు. కరోనా స్ట్రెయిన్ కారణంగా జనాలు మరింత జాగ్రత్తలు పాటించాలంటూ సల్మాన్ ఖాన్ పేర్కొన్నాడు.
సల్మాన్ ఖాన్ ను ఈసారి చూడలేక పోతున్నందుకు అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో సల్మాన్ ఖాన్ కు లక్షల మంది పుట్టిన రోజు శుభాకాంక్ష లు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ రెండు మూడు సినిమాలను లైన్ లో ఉంచాడు. వచ్చే ఏడాది కనీసం రెండు సినిమాలను అయినా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ సమయంలో సల్మాన్ ఖాన్ షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు. మరో వైపు బిగ్ బాస్ షూటింగ్ లో కూడా సల్మాన్ పాల్గొంటున్నాడు.