Begin typing your search above and press return to search.

60కి చేరువ‌లో ఉన్నా సింహ‌బ‌లుడే

By:  Tupaki Desk   |   6 March 2020 10:30 PM GMT
60కి చేరువ‌లో ఉన్నా సింహ‌బ‌లుడే
X
ఏజ్ ముదురుతున్న కొద్దీ రూపం మారిపోతుంటుంది. చేవ‌చ‌చ్చి కీళ్ల నొప్పుల‌తో బాధ‌ప‌డేవాళ్లే ఎంద‌రో. కొంద‌రు హీరోల‌కు అయితే బ్యాక్ పెయిన్ స‌మ‌స్య కూడా. కెరీర్ ఆద్యంతం డ్యాన్సులు ఫైట్స్ అంటూ చాలా హార్డ్ వ‌ర్క్ చేస్తారు కాబ‌ట్టి ఆ ప్ర‌భావం శ‌రీరంపై త‌ప్ప‌నిస‌రిగా ఉంటుంది. అయితే ఇక్క‌డ క‌నిపిస్తున్న భీక‌రాకారుడికి ఇలాంటివేమీ చేయ‌డం లేద‌ని అర్థ‌మ‌వుతోంది.

భారీ ఆకారాన్ని మెయింటెయిన్ చేయాలంటే .. అది కూడా ఫిట్ బాడీని మ‌ల‌చాలంటే అందుకు జిమ్ముల్లో ఎంత‌గా క‌స‌ర‌త్తులు చేయాలో నిరంత‌రం ఆహార నియ‌మాల్ని అంతే ఇదిగా పాటించాలి. వీటికి తోడు బ్యాచిల‌ర్ లైఫ్ అయితేనే కాస్తంత ప్ర‌శాంత‌త సాధ్యం అనుకున్నాడేమో.. అది కూడా మెయింటెయిన్ చేస్తూ స‌ల్మాన్ భాయ్ ఇదిగో ఇలా అద్భుత‌మైన రూపాన్ని మెయింటెయిన్ చేస్తున్నాడు. ఓవైపు కెరీర్ ప‌రంగా క్ష‌ణం తీరిక ఉండ‌కుండా బిజీ. అయినా నిరంత‌రం ఫిట్ నెస్ ప‌రంగా ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటాడు. అందుకే సుల్తాన్ అంటే భాయ్ ఒక్క‌డే అన్నంత కాన్ఫిడెన్స్.

వ‌ర‌ల్డ్ వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే ఆషామాషీనా?ఇందుకే అత‌డికి అంత ఫాలోయింగ్. 54 సంవత్సరాల వయస్సులో ఎంత గొప్ప ఫిట్‌నెస్!నమ్మలేని నిజం ఇది. భాయ్ ష‌ష్ఠిపూర్తికి ఇంకెంతో దూరంలో లేడు. మ‌రో ఆరేళ్లు క‌ళ్లు మూసుకుంటే అయిపోతుంది. ఇలాంట‌ప్పుడు ఇంత‌గా మెయింటెయిన్ చేయ‌డం గ్రేట్ అనే చెప్పాలి. భాయ్ ప్ర‌స్తుతం రాధే అనే చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.