Begin typing your search above and press return to search.

కండల వీరుడి కరోనా సాయం లెక్క తేలింది..!

By:  Tupaki Desk   |   15 April 2020 3:00 PM GMT
కండల వీరుడి కరోనా సాయం లెక్క తేలింది..!
X
కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్ అమలులో ఉంది. దీంతో చాలా మంది సినీ కార్మికులకు పనిలేకుండా పోయింది. మన టాలీవుడ్ లో సినీ కార్మికుల సహాయం కోసం కరోనా క్రైసిస్ ఛారిటీ ఏర్పాటు చేసి వారికి అండగా ఉంటున్నారు. మరోవైపు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఏకంగా రూ. 25 కోట్లు విరాళం ఇచ్చి సంచలనం రేపాడు. దానికి తోడు ముంబ‌యి మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌ కు కూడా రూ.3 కోట్ల విరాళం అందించాడు. ఆయనతో పాటు అజయ్ దేవ్‌ గణ్ - వరుణ్ ధావన్ - అమితాబ్ - హృతిక్ - విక్కీ కౌశల్ వంటి నటులు తమ వంతుగా సాయం చేసారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా తనవంతు సాయం చేయడానికి ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. 25వేల మంది సినీ కార్మికులకు ఆర్థిక సాయం చేస్తానని సల్మాన్‌ ఖాన్ ప్రకటించాడు. ఒకేసారి పూర్తి మొత్తం ఇస్తే అనవసరంగా ఖర్చు అవుతుందని భావించిన సల్మాన్.. పలు విడతల్లో వారికి సాయం చేసారు.

అందులో భాగంగా తొలి విడతలో పేద సినీ కార్మిక కుటుంబాలకి రూ.3 వేలు అందించిన స‌ల్మాన్.. రెండో నెల‌కు కూడా నిధులు విడుద‌ల చేశాడ‌ట‌. అంటే 25 వేల మందికి ఇప్ప‌టిదాకా ఒక్కొక్క ఫ్యామిలీకి రూ.6 వేల చొప్పున అందాయ‌న్న మాట‌. ఇలా మొత్తం స‌ల్మాన్ నుంచి రూ.15 కోట్ల సాయం అందిన‌ట్లు ఫెడ‌రేష‌న్ ఆఫ్ వెస్ట్ర‌న్ ఇండియా సినీ ఎంప్లాయిస్ యూనియన్ వారు వెల్ల‌డించారు. క‌రోనా ప్ర‌భావం ఎలా ఉంటుంద‌న్న దాన్ని బ‌ట్టి త‌ర్వాతి నెల‌కు కూడా ఇదే త‌ర‌హాలో సాయం అందించ‌డానికి స‌ల్మాన్ సిద్ధ‌ప‌డుతున్నాడట. అంటే స‌ల్మాన్ ఇంకో రూ.7.5 కోట్లు అందించే అవ‌కాశ‌ముంది. ఆ త‌ర్వాత ఎలాగూ సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొంటాయ‌ని.. ఈలోపే షూటింగ్‌ లు పునః ప్రారంభ‌మ‌వుతాయ‌ని భావిస్తున్నారట.