Begin typing your search above and press return to search.

లవర్ తో సల్మాన్ రొమాంటిక్ షికార్లు

By:  Tupaki Desk   |   3 April 2017 1:07 PM GMT
లవర్ తో సల్మాన్ రొమాంటిక్ షికార్లు
X
సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ అంతా ఇప్పుడు మాల్దీవ్స్ లో ఉందని.. తన సోదరి అర్పితా ఖాన్ కొడుకు అహిల్ బర్త్ డే వేడుకులను అక్కడ జరుపుకుంటున్నారని ముందే చెప్పుకున్నాం. అందరూ కనిపించినా.. సల్మాన్ మాత్రం మొదట అక్కడ మిస్ అయ్యాడు. ట్యూబ్ లైట్ షూటింగ్ కోసం ఆస్ట్రియాలో ఉన్న సల్లూ భాయ్.. సరిగ్గా మేనల్లుడి పుట్టిన రోజునాటికి మాల్దీవ్స్ లో వాలిపోయాడు.

ఇందులో పెద్ద విశేషమేమీ లేదు కానీ.. సల్మాన్ ఫ్యామిలీతో కలిసి యూలియా వంతూర్ కూడా ముందే మాల్దీవ్స్ లో మకాం వేసేసింది. ఇప్పుడు ఖాన్ కూడా వచ్చేశాడు. అసలే ఎంజాయ్మెంట్ టైం. పైగా పక్క దేశాలలో కలుసుకునే అవకాశం. ఒకసారిగా కాకుండా.. విడివిడిగా మాల్దీవ్స్ చేరుకున్న ఈ జంట.. ఇక హంగామా బిగిన్ చేసేశారు. స్పెషల్ యాచ్ లలో తిరుగుతూ సముద్రాన్ని చుట్టేస్తున్నారు. సల్మాన్-యూలియాలు ఇద్దరూ కలిసి ఇలా బోట్ లో చక్కర్లు కొడుతున్న ఓ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అయిపోయింది.

వీళ్లిద్దరూ లవర్స్ అని తెలిసినా సరే.. ఈ వీడియోకి ఇంత క్రేజ్ రావడానికి కారణం.. ఇప్పటివరకూ వీళ్లిద్దరినీ ఇంత క్లోజ్ గా చూసే భాగ్యం ఎప్పుడూ చిక్కకపోవడమే. లవర్స్ అని చెప్పుకోవడమే తప్ప.. రొమాంటిక్ మూడ్ లో ఎప్పుడూ మీడియాకి దొరకలేదు సల్లూ భాయ్. కానీ ఇప్పుడు మాల్దీవ్స్ లో లవర్ యూలియా వంతూర్ తో షికార్లు కొడుతూ దొరికిపోయాడు 51 ఏళ్ల సల్మాన్ ఖాన్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/