Begin typing your search above and press return to search.

భాయ్‌-క‌త్రిన క‌త్తిలాంటి జోడీ

By:  Tupaki Desk   |   28 Aug 2018 4:46 AM GMT
భాయ్‌-క‌త్రిన క‌త్తిలాంటి జోడీ
X
స్టిల్ 50 ప్ల‌స్ బ్యాచిల‌ర్ స‌ల్మాన్ ఖాన్ ఇక పెళ్లి అన్న మాటే లేకుండా కేవ‌లం సినిమాల‌తోనే స‌హ‌జీవ‌నం చేస్తున్నాడు. సినిమా వెంట సినిమా చేస్తూ - న‌వ‌త‌రం నాయిక‌ల‌కు అవ‌కాశాలిస్తూ కెరీర్‌ లోనే బిజీగా ఉన్నాడు. పెళ్లి చేసుకుని లైఫ్‌ లో సెటిల‌య్యేదెప్పుడు? అన్న మాటెత్తితే దానికి ర‌క‌ర‌కాల కుంటె సాకులు చెబుతున్నాడు. ఇటీవ‌లి కాలంలో గాళ్‌ ఫ్రెండ్ లులియా వాంటూర్ పూర్తిగా సైడైపోయిన‌ట్టే క‌నిపిస్తోంది. ఆ క్ర‌మంలోనే స‌ల్మాన్ వ‌ద్ద‌కు చేరింది క‌త్రిన‌కైప్‌. వ‌రుస‌గా అత‌డితో సినిమాల‌కు సంత‌కాలు చేస్తూ వేడి పెంచుతోంది. ఇదివ‌ర‌కూ టైగ‌ర్ జిందా హైలో స‌ల్మాన్‌ కు జ‌త‌గా ఆన్‌ స్క్రీన్ రొమాన్స్ అద‌ర‌గొట్టేసింది. అలీ అబ్బాస్ జాఫ‌ర్ ఆ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇప్పుడు జాఫ‌ర్ మ‌రో భారీ యాక్ష‌న్ చిత్రం తెర‌కెక్కిస్తున్నారు.

ఈ సినిమా టైటిల్ భ‌ర‌త్. వాస్త‌వానికి ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా న‌టించాల్సి ఉన్నా స‌డెన్‌గా త‌ప్పుకోవ‌డంతో క‌త్రిన‌కైఫ్‌ ని బ‌రిలో దించాడు భాయ్. స‌ల్మాన్‌ తో క‌త్రిన ఆన్‌ స్క్రీన్ రొమాన్స్‌కి తిరుగేలేదు కాబ‌ట్టి జాఫ‌ర్ వెంట‌నే ఖాయం చేసేశాడు. ప్ర‌స్తుతం భ‌ర‌త్ సెట్స్ పై ఉంది. ఆన్ లొకేష‌న్ క‌త్రిన‌తో రొమాన్స్ ఎలా ఉంటుందో ఇదిగో ఈ ఫోటోతో చెప్పేసింది టీమ్‌.

పారూ - దేవ‌దాసు - లైలా - మ‌జ్జు - ముంతాజ్ - షాజ‌హాన్‌... ఈ రేంజులో ఆ ఇద్ద‌రి మ‌ధ్యా కెమిస్ట్రీ వ‌ర్క‌వుటైంద‌ని ఈ ఫోటో చెబుతోంది. భ‌ర‌త్‌కి త‌గ్గ లైలాను త‌ల‌పిస్తోంది. ఆ ప‌చ్చ‌ని డిజైన‌ర్ డ్రెస్‌ లో క‌త్రిన అందం రెట్టింపైంది. పారూ కోసం ప‌రిత‌పించి పోయే దేవ‌దాసులా స‌ల్మాన్ భాయ్ తాధాత్మ్యంలో ఉన్నాడు. ప్ర‌స్తుతం మాల్టాలో చిత్రీక‌ర‌ణ సాగుతోంది. అక్క‌డి నుంచి జాఫ‌ర్ స్వ‌యంగా ఈ ఫోటోని సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేశారు. 2014 సౌత్ కొరియ‌న్ సినిమా `ఓడ్ టు మై ఫాద‌ర్` ఆధారంగా భ‌ర‌త్ చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో ట‌బు - దిశా ప‌టానీ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. 2019 ఈద్ కానుక‌గా రిలీజ్ కానుంది.