Begin typing your search above and press return to search.
ఆయన కిక్2 వేరు, మన కిక్2 వేరు
By: Tupaki Desk | 28 Aug 2015 9:32 AM GMTమాస్ మహారాజ్ రవితేజ నటించిన కిక్ సినిమాని హిందీలో సల్మాన్‌ఖాన్ హీరోగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. తెలుగులోలానే బాలీవుడ్ లోనూ పెద్ద హిట్టయ్యింది. ఇప్పుడు రవితేజ నటించిన కిక్2 ఇటీవలే రిలీజై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. మరి కిక్2 సీక్వెల్ లో సల్మాన్ నటిస్తారా? లేదా? అన్న సందేహం పరిశ్రమ వర్గాలతో పాటు కామన్ జనాల్లోనూ ఉంది.
అయితే దానికి క్లారిటీ వచ్చేసింది. ఈసారి మన కిక్2ని హిందీలో రీమేక్ చేయబోవడం లేదు. ఎందుకంటే రిజల్ట్ నెగెటివ్. పైగా అందులో అంత కిక్కు లేదని తేలిపోయింది. బాక్సాఫీస్ ఫలితాన్ని పరిశీలించి వద్దులే అనుకున్నారో ఏమో! ప్రస్తుతం వాళ్లకు వాళ్లుగా కిక్2 కథ రాసుకున్నారు. అందులో సల్మాన్ ఖాన్ డబుల్ రోల్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని సల్మాన్, రవితేజ కాస్త గోప్యంగా చెబుతున్నారంతే.
ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి 60వ పుట్టినరోజు వేడుకల్లో రవితేజ సల్మాన్ ఖాన్ ని కలిశాడు. కిక్2లో డబుల్ రోల్ చేశానని చెప్పాడు. అవును నేను కూడా చేస్తున్నా. కిక్2 కథ రెడీ అవుతోంది అంటూ సల్మాన్ చెప్పాడు. అంటే కిక్2 రిలీజ్ కోసం, ఆ సినిమా రీమేక్ హక్కుల కోసం వేచి చూడలేదని సల్మాన్ చెప్పకనే చెప్పాడు. అసలు తెలుగు కిక్2తో సంబంధం లేని కిక్2ని బాలీవుడ్ లో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే దానర్థం. నార్త్ జనం బతికారు దేవుడ!