Begin typing your search above and press return to search.

#DRUGS స‌ల్మాన్ భాయ్ కి వివాదాస్ప‌ద‌ KWAN లో వాటా లేదు

By:  Tupaki Desk   |   22 Sep 2020 6:23 PM GMT
#DRUGS స‌ల్మాన్ భాయ్ కి వివాదాస్ప‌ద‌ KWAN లో వాటా లేదు
X
బాలీవుడ్ కండ‌ల‌హీరో సల్మాన్ ఖాన్ త‌రపున న్యాయవాది ఆనంద్ దేశాయ్ ఒక ప్రకటన విడుదల చేశారు. టాప్ టాలెంట్ మేనేజ్ మెంట్ ఏజెన్సీ KWAN లో తన క్లైంట్ కు ఎలాంటి వాటా లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం బాలీవుడ్ డ్రగ్స్ లింక్స్ పై ఎన్‌సిబి దర్యాప్తు మధ్య వివాదాల మ‌యం కాగా.. స‌ల్మాన్ పేరు క్వాన్ తో లింక‌ప్ అయ్యి ఇందులో వినిపిస్తోంది. దాంతో లాయ‌ర్ ఈ వివ‌ర‌ణ ఇచ్చారు.

``మా క్లయింట్ మిస్టర్ సల్మాన్ ఖాన్ KWAN టాలెంట్ మేనేజ్ మెంట్ ఏజెన్సీలో మెజారిటీ వాటాను కలిగి ఉన్నారని కొన్ని మీడియాలు తప్పుగా ప్ర‌చారం సాగిస్తున్నాయి. మిస్టర్ ఖాన్ కు క్వాన్ లేదా దాని సమూహ సంస్థలలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎటువంటి వాటా లేదు`` అని లాయ‌ర్ ఆనంద్ ప్ర‌క‌టించారు.

మాదకద్రవ్యాల నియంత్రణ బ్యూరో ప్రశ్నించిన క్వాన్ సంస్థ నుండి టాలెంట్ మేనేజర్ జయ సాహా తరువాత KWAN CEO ధ్రువ్ చిట్గోపెకర్ ను కూడా నార్కో అధికారులు పిలిచారు. దీపికా పదుకొనే మేనేజర్ కరిష్మా ప్రకాష్ ను ఎన్.‌సిబి విచార‌ణ‌కు పిలిచింది.

ఎన్ సిబి రంగ ప్ర‌వేశంతో పరిశ్రమ లో తీవ్ర భయాందోళనలు నెల‌కొన్నాయి. ఆరుగురు బాలీవుడ్ అగ్రశ్రేణి స్టార్ హీరోలు తమ న్యాయవాదులను పిలిచి భవిష్యత్ ప‌రిణామాల్ని ఎలా ఎదుర్కోవాలి? అన్న‌దాని గురించి చర్చించారు. భయాందోళనకు గురవుతున్న నటులు వారి పేర్లు ఈ గొడ‌వ‌లో వినిపిస్తే న్యాయ సలహా తీసుకున్నారు.