Begin typing your search above and press return to search.
పాట కోసం గాళ్ ఫ్రెండును పట్టుకొచ్చాడు
By: Tupaki Desk | 5 April 2018 7:18 AM GMTసల్మాన్ ఖాన్... పైకి కనిపించడు కానీ మంచి కళాపోషకుడు. తన సినిమాల కోసం వెతికి వెతికి హీరోయిన్లను తెచ్చే ఈ 50 ఏళ్ల బ్యాచిలర్... కొన్నిసార్లు నచ్చిన వాళ్లను తెచ్చుకునేందుకు దేశాలు కూడా దాటేస్తుంటాడు. ‘ట్యూబ్ లైట్’ సినిమా కోసం ఛైనీస్ నటి జూజూని పట్టుకొచ్చిన సల్మాన్... ఇప్పుడు చేస్తున్న ‘రేస్ 3’ సినిమా కోసం రోమన్ నటిని పట్టుకొస్తున్నాడట. అయితే ఈసారి నటించడానికి కాదు... పాడడానికి!
అనిల్ కపూర్- సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ‘రేస్’...‘రేస్ 2’ సినిమాలకి స్వీకెల్ గా రూపొందుతున్న చిత్రం ‘రేస్ 3’. ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ ప్లేస్ లో సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడు. బాబీ డియోల్- జాక్వెలిస్ ఫెర్నాండేజ్ - దైసీ షా వంటి నటులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం సల్లూ భాయ్ మొదటి సారిగా పెన్ను పట్టి... తనలోని మరో కోణాన్ని పరిచయం చేస్తూ ఓ పాటను కూడా రాశాడట. ఈ పాటను పాడేందుకు అల్లా టప్పా సింగర్లు పనికి రారని ఫీల్ అయిన సల్మాన్ ఏకంగా తన ప్రియురాలు మరియు రొమానియన్ మోడల్ లులియా వంటూర్ ని కలిసాడట. విశాల్ మిశ్రా కంపోజ్ చేసిన ఈ పాటను అతిఫ్ అస్లాం పాడాడు. ఫీమేల్ వాయిస్ కోసం లులియాను సంప్రదించిందట చిత్ర బృందం.
ఈ పాట పాడేందుకు ఓ ఫ్రెష్ ఫీమేల్ సింగర్ కోసం వెతుకుతున్న చిత్ర బృందానికీ... సల్లూ భాయే స్వయంగా లులియా గురించి చెప్పి- ఆమెతో పాడించాలని చెప్పాడట. లులియాలో మనోడు అంత స్పెషాలిటీ ఏం చూశాడో... ఎప్పుడు చూశాడో కానీ ఆమె గొంతుని వినాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ‘రేస్ 3’ సినిమా ఈద్ కానుకగా జూన్ 15న విడుదలకు సిద్ధమవుతోంది.