Begin typing your search above and press return to search.

నాకు కత్రినా కన్నా ముఖ్యమైనది లేదు

By:  Tupaki Desk   |   15 July 2017 9:39 AM GMT
నాకు కత్రినా కన్నా ముఖ్యమైనది లేదు
X
బాలీవుడ్ త్రిమూర్తులులలో ఒకడైన సల్మాన్ ఖాన్ ఎప్పటికీ అప్పుడు తన మాటల తెగువతో దుడుకుతనంతో వార్తలలోకి వస్తూనే ఉంటాడు. సల్మాన్ ఖాన్ ఇప్పుడు దేన్ని అంతగా సీరియస్ గా తీసుకోవడం మానేశాడు. తన కెరియర్ తన బిజినెస్ గురించి తప్పితే మరేదీ పట్టనట్లు మాట్లాడుతున్నాడు. ఈ మధ్య ఒక IIFA వేడుక ప్రెస్ మీట్లో కూడా తన సహజమైన ధోరణిలో మాట్లాడి అక్కడ ఉన్న అందరినీ సంతోష పెట్టాడు. అక్కడే ఉన్న బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ మరింత ఆనందపడింది అనే చెప్పాలి. ఎందుకంటే..

కత్రినా కైఫ్ సల్మాన్ ఖాన్ మధ్య బంధం తెగి చాలాకాలం అయ్యింది. వాళ్ళు కలుసుకోవడం కూడా మానేశారు. అయితే కత్రినా కైఫ్ రణబీర్ కపూర్ తో తెగతెంపులు చేసుకున్న తరువాత సల్మాన్ ఖాన్ తో స్నేహంగా ఉంటోంది. బాలీవుడ్లో స్టార్లు ప్రేమలో పడటం మళ్ళీ విడిపోవటం విడిపోయి స్నేహంగా ఉండటం మనం చాలసార్లు చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా సల్మాన్ ఆ ప్రెస్ మీట్లో అందరిని పలకరించి నాతో మీరు పుట్టినరోజు పాట పాడండి ఎందుకంటే కత్రినా కైఫ్ పుట్టిన రోజు జూలై 16న ఉంది. నాకు ఏ ఫంక్షన్ డేట్లు గుర్తుండవు కానీ కత్రినా పుట్టినరోజు మాత్రం గుర్తుకు ఉంటుది అని చెప్పాడు. అక్కడ ఉన్న అందరితో అలా పాడించి కత్రినాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పించాడు. దీనికి కత్రినా కైఫ్ తెగ సంబరపడి పోయింది.

ఇంకా IIFA గురించి ఈవెంట్ లో తన ఆట పాట గురించి ఇలా కామెంట్ చేశాడు. “అందరి ముందు స్టేజ్ పై డాన్స్ చేయడం చాలా కష్టం. నేను అంతా బాగ డాన్స్ వేయలేను.. కానీ చేస్తున్నా.. ఏమి చేస్తాం చెప్పండి. సరిగా చేయకపోయినా డబ్బులు ఇస్తున్నారు వాళ్ళు.. సో నేను చేస్తున్నాను” అని తేలికగా అనేశాడు. దానితో పాటుగా ''నాకు అవార్డులు పై అంతా నమ్మకం లేదు నా సినిమా ‘మైనే ప్యార్ కియా’ అవార్డ్ వచ్చింది అప్పుడు ఆ టైమ్ లో ఉన్న ఎడిటర్ చెప్పాడు నువ్వు రాకపోతే వేరే వాళ్ళకు ఈ అవార్డ్ ఇస్తాను అని చెప్పాడు. అప్పటి నుండి అవార్డులును సీరియస్గా తీసుకోవడం మానేశాను'' అన్నాడీ భాయిజాన్.