Begin typing your search above and press return to search.

ఈ డబ్బులు ఎక్కడున్నాయ్ సామీ??

By:  Tupaki Desk   |   26 Jun 2017 4:48 PM GMT
ఈ డబ్బులు ఎక్కడున్నాయ్ సామీ??
X
మొన్ననే ఫోర్బ్స్ మ్యాగజైన్ వారు అత్యంత ధనికులైన సెలబ్రిటీల లిస్టును తయారు చేశారు. ప్రతీ ఏడాది చేసినట్లే.. ఒక సెలబ్రిటీ దగ్గర ఉండే డబ్బు.. అతని ఆస్తులు.. షేర్లు.. చేతిలో ఉన్న కాంట్రాక్టులను బట్టి వాల్యూషన్ కానిచ్చారు. అయితే ఆదాయం విషయంలో మాత్రం.. వారు రీసెర్చ్ చేసి కనిపెట్టిన డబ్బంతా నిజమేనా అనే సందేహం మనకు వచ్చినా రాకపోయినా.. వారు అచ్చేసిన నెంబర్లలో తప్పులున్నాయ్ అంటూ సాక్షాత్తూ బాలీవుడ్ టాప్ హీరో గగ్గోలు పెడుతున్నాడు.

2017 ఫోర్బ్స్ ధనికులైన సెలబ్రిటీల జాబితాలో.. సల్మాన్‌ ఖాన్ నెం.1 పొజిషన్లో ఉన్నాడు. మనోడు గత ఫైనాన్షియల్ సంవత్సరానికి గాను.. 238 కోట్ల రూపాయలను సంపాదించినట్లు ఆ పత్రిక ప్రచురించింది. ఇదే విషయం సల్మాన్ దగ్గర ప్రస్తావిస్తే.. ''అసలు ఆ డబ్బులన్నీ ఎక్కడున్నాయ్ సామీ??'' అంటూ మీడియాకే చురకేశాడు. ''మొన్ననే నేనూ షారూఖ్‌ ఖాన్ కలసినప్పుడు మాట్లాడుకున్నాం.. అసలు డబ్బులు పెట్టుబడిగా తేవడం ఎంత కష్టమవుతోందోనని. ప్రతీసారి ఏదన్నా చేయాలంటే చివర్లో డబ్బులు తక్కువైపోతుంటాయ్'' అంటూ సల్మాన్ ఒక ఉదాహరణ కూడా ఇచ్చేశాడు. అంటే సల్మాన్ దగ్గర అంత డబ్బులు లేవని అంటున్నాడు.. అంతేగా?

నిజానికి హీరోలకు ఏ ప్రొడక్షన్ హౌస్ కూడా చెప్పినంత పేమెంట్ ఇవ్వట్లేదట. ముందేదో నామినల్ గా డబ్బులు ఇచ్చేసి.. తరువాత లాభాల్లో వాటాలు అంటున్నారు కాని.. అది అంతగా వర్కవుట్ కావట్లేదని సల్మాన్ ఫీలింగ్. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/