Begin typing your search above and press return to search.

కుర్రజంటకు ముద్దులాట నేర్పలేను

By:  Tupaki Desk   |   8 Sep 2015 10:38 PM GMT
కుర్రజంటకు ముద్దులాట నేర్పలేను
X
కండల హీరో సల్మాన్‌ ఖాన్‌ ఆఫ్‌ ద స్క్రీన్‌ చేసేవేవీ ఆన్‌ ద స్క్రీన్‌ చేయడానికి ఇష్టపడడు. బాలీవుడ్‌ లో సీనియర్‌ బ్యాచిలర్‌ గా ఇప్పటికే ఐదురుగు కథానాయికలతో రొమాన్స్‌ చేసిన సల్లూ భాయ్‌ .. ఆన్‌ స్క్రీన్‌ మాత్రం ఒక్కసారి కూడా పెదవి ముద్దు పెట్టుకున్నదే లేదు. అంతేకాదు నవతరం హీరో-హీరోయిన్‌ ముద్దు పెట్టుకుంటేనే సినిమాలు ఆడేయవు.. అంటూ క్లాస్‌ తీసుకుంటున్నాడు. డీటెయిల్స్‌ లోకి వెళితే..

ప్రస్తుతం ఆదిత్య పాంచోళీ తనయుడు సూరజ్‌ పాంచోళీ హీరోగా, సునీల్‌ శెట్టి డాటర్‌ ఆధియా శెట్టి హీరోయిన్‌ గా 'హీరో' తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సల్మాన్‌ ఖాన్‌ నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. ఎడిట్‌ రూమ్‌ లో కూచుని సల్లూభాయ్‌ దాదాపు 30 నిమిషాల సినిమాని ఎడిట్‌ చేయించాడు. అందులో ఓ కిస్సింగ్‌ సీన్‌ కూడా కట్‌ అయిపోయింది.

ఆ సీన్‌ పోయినందుకు యువజంట బాధపడుతోందేమో! అన్న ప్రశ్న వేస్తే.. సినిమాలు ఆడటానికి ముద్దు సన్నివేశాలు అక్కర్లేదు. అయినా ఈ కుర్రాళ్లకు నేనేమైనా చెప్పగలనా.. ముద్దు పెట్టుకోమని! మైనే ప్యార్‌ కియా చేసినప్పుడు ఆదిత్యకి స్టార్‌ డమ్‌ లేనేలేదు. కానీ అతడు పెద్ద స్టార్‌ డైరెక్టర్‌ గా ఎదిగాడు కదా! ఇప్పుడు సూరజ్‌ కూడా అలానే ఎదుగుతాడు అంటూ కితాబిచ్చాడు.