Begin typing your search above and press return to search.
నార్త్ పై సౌత్ డామినేషన్.. సల్మాన్ ఒపీనియన్ ఇదీ
By: Tupaki Desk | 26 July 2022 4:13 AM GMTఇటీవల అజయ్ దేవగన్ వర్సెస్ కిచ్చా సుదీప్ నడుమ వార్ ఆఫ్ వర్డ్స్ గురించి తెలిసిందే. సౌత్ వర్సెస్ నార్త్ డిబేట్ లో భాగంగా ఉత్తరాది పరిశ్రమ అభద్రత గురించి బిగ్ డిబేట్ నడిచింది. ఇలాంటి సందర్భంలో కూడా కన్నడ కిచ్చా సుదీప్ కి సల్మాన్ భాయ్ నుంచి బోలెడంత సపోర్ట్ దక్కడం విశేషం. సల్మాన్ ఖాన్ ఉత్తర భారతదేశంలో కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ తదుపరి యాక్షన్-అడ్వెంచర్ 'విక్రాంత్ రోనా'ను సగర్వంగా ప్రదర్శిస్తున్నారు. సుదీప్ -జాక్వెలిన్ ఫెర్నాండెజ్ లతో కలిసి మెగా-బడ్జెట్ చిత్రాన్ని ప్రమోట్ చేస్తూ సల్మాన్ బోలెడంత హంగామా చేస్తున్నాడు.
తాజా ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఓ ఆసక్తికర విషయం ప్రస్థావనకు వచ్చింది. సౌత్ ఇండస్ట్రీ బాలీవుడ్ ను డామినేట్ చేస్తోందనే చర్చ గురించి.. పరిశ్రమల మధ్య అభద్రతా భావం గురించి కిచ్చా చమత్కరించారు.పరిశ్రమల నడుమ అభద్రతా భావం లేదు. మేం అందమైన వాతావరణంలో జీవిస్తున్నామని సుదీప్ చెప్పేందుకు ప్రయత్నించాడు. ''మేము ఒకరికొకరం ఎందుకు సహకరించుకుంటాము? సార్ (సల్మాన్ ఖాన్) మా చిత్రానికి ఎందుకు మద్దతు ఇస్తారు? ఆమె (జాక్వెలిన్) మా చిత్రానికి ప్రత్యేక పాత్రతో ఎందుకు మద్దతు ఇస్తుంది? అని అన్నారు.
''సర్ (సల్మాన్) చిరంజీవి గాడ్ ఫాదర్ షూటింగ్ కోసం హైదరాబాద్ వెళ్ళారు. కానీ అతడు ఎందుకు అలా చేస్తాడు? ఎవరూ అభద్రతతో లేరు. మేము పరస్పరం సహకరించుకోవడం ఆలోచనలను మార్చుకోవడం? ఒకరినొకరు ఆమోదించడం వంటి అందమైన సంబంధాన్ని పంచుకుంటాము. మా మధ్య అందమైన వాతావరణం ఉంది. అది మూడవ కంటికి కనిపించదు. మనం సినిమాలను జనరలైజ్ చేయకూడదు. ప్రతి పరిశ్రమ స్వయం యోగ్యతపై నిలుస్తుంది'' అని సుదీప్ అన్నారు.
సల్మాన్ ఖాన్ కూడా ఈ వైరుధ్యాల గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. క్రాస్-పరాగసంపర్కం (ఇరుగు పొరుగు కలిసి పని చేయడం) అనేది ఎల్లప్పుడూ ఉంటుందని అంగీకరించాడు. అయితే ఇటీవలి కాలంలో అది ఆగిపోయింది.
అది ఎప్పుడూ ఉండేది... కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. కానీ నేను నా కెరీర్ లో సౌత్ లో ప్రతిభావంతులతో పని చేస్తున్నాను. సుదీప్- ప్రకాష్ రాజ్- ప్రభుదేవా సహా చాలా మందితో పనిచేశాను. సౌత్ డైరెక్టర్లు .. డిఓపిలతో పని చేసాను. నేను వెంకీ (వెంకటేష్)తో కలిసి పని చేస్తున్నాను.
అతని మొదటి చిత్రం 'అనారి' బాలీవుడ్ లో భారీ విజయాన్ని సాధించింది. పెద్ద హిట్ లను అందించిన కమల్ హాసన్ సార్ మరొక ఉదాహరణ. ప్రతి ఇండస్ట్రీ పెద్ద సినిమాలు తీయాలని ప్రయత్నిస్తుందని కానీ దానికి ఫిక్స్‌డ్ ఫార్ములా లేదని సల్మాన్ నమ్ముతానని అన్నాడు. మేమంతా పెద్ద సినిమాలు తీయాలని ప్రయత్నిస్తాం. కొన్నిసార్లు అది పని చేస్తుంది.. కొన్నిసార్లు పని చేయదు. కాబట్టి విజయవంతమైన చిత్రానికి ఫిక్స్డ్ ఫార్ములా లేదు'' అని అన్నారు. సుదీప్ నటించిన విక్రాంత్ రోణ సినిమా జూలై 29న విడుదల కానుంది.