Begin typing your search above and press return to search.

సల్మాన్ తో కత్రినా పాత కథ కంటిన్యూ

By:  Tupaki Desk   |   24 Jan 2016 5:30 PM GMT
సల్మాన్ తో కత్రినా పాత కథ కంటిన్యూ
X
బాలీవుడ్ జంటల ప్రేమకథలు భలే ఇంట్రెస్టింగ్ ఉంటాయి. టాప్ బ్యూటీ కత్రినా కైఫ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కు మాజీ ప్రేయసి అనే విషయం తెలిసిందే. ఇప్పడు రణ్ బీర్ కపూర్ కి కూడా కేట్ మాజీ లవరే. ఇలా విడిపోవడం వింత కాదు కానీ.. మాజీ లవర్స్ ఇద్దరూ మళ్లీ కలిసి కనిపించడమే హైలైట్.

ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9 ఫైనల్ స్టేజ్ కి వచ్చింది. ఈ సందర్భంగా కత్రినా కైఫ్ ను గెస్ట్ గా పిలిచారు నిర్వాహకులు. సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ రియాలిటీ షోకి సంబంధించిన ఫైనల్స్ ఎపిసోడ్ రీసెంట్ గా టెలికాస్ట్ అయింది. ఇందులో కత్రినా కైఫ్ ని ప్రశంసలతో ముంచెత్తాడు సల్లూ భాయ్. బాలీవుడ్ అత్యంత స్ట్రాంగ్ మహిళగా కేట్ ని అభివర్ణించాడు. అంతే కాదు.. బాలీవుడ్ లో ఆమె ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ సాగిందని, అయినా ఆమె తన స్థానాన్ని పెంచుకోవడం, తనకు స్ఫూర్తినిచ్చిందన్నాడు సల్మాన్.

ఇప్పటికి నేను కత్రినాకి దీవానా నే అని సల్మాన్ ఖాన్ అనడం... ఈ ఎపిసోడ్ కే హైలైట్ గా నిలిచింది. మరోసారి సల్మాన్, కేట్ లను అత్యంత దగ్గరగా చూసిన ప్రేక్షకులు ఫుల్లు ఖుషీ అయ్యారు. అయితే.. ఇది రణ్ బీర్ కపూర్ కి సల్మాన్ ఇచ్చిన కౌంటర్ అని కొంతమంది అంటున్నారు. అలాగని సల్మాన్ ఇంతగా పొగిడేసినా, తనకు దీవానా అని చెప్పినా కత్రినా ఏం ఫీల్ కాలేదు. ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ బాగానే ఎంజాయ్ చేసింది.