Begin typing your search above and press return to search.

ఫ్లాపును ఆపలేకపోయాడు చెర్రీ!!

By:  Tupaki Desk   |   18 Nov 2015 5:15 AM GMT
ఫ్లాపును ఆపలేకపోయాడు చెర్రీ!!
X
టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌ చ‌ర‌ణ్ - బాలీవుడ్ కండ‌ల హీరో స‌ల్మాన్‌ ఖాన్ .. ఈ ఇద్ద‌రి మ‌ధ్యా స్నేహం ఆల్ టైమ్ హాట్ టాపిక్‌. చ‌ర‌ణ్ ముంబై వెళితే స‌ల్మాన్ రిసీవ్ చేసుకుంటాడు. స‌ల్మాన్ హైద‌రాబాద్ వ‌స్తే చ‌ర‌ణ్ రిసీవ్ చేసుకుంటాడు. ఈ ఇరు కుటుంబాల మ‌ధ్య సాన్నిహిత్యం అలాంటిది. అప్ప‌ట్లో స‌ల్మాన్ త‌న సోద‌రి అర్పిత వివాహానికి మెగా ఫ్యామిలీని ప్ర‌త్యేక అతిధులుగా ఆహ్వానించాడు. హైద‌రాబాద్ పాత బ‌స్తీలోని ఓ విలాస‌వంత‌మైన హోట‌ల్లో జ‌రిగిన ఈ వేడుక‌కు మెగా ఫ్యామిలీ ఎటెండ్ అయ్యింది. స‌ల్మాన్ - మెగా హీరోల చెలిమి ఆ స్థాయిలోనిది.

అందుకే స‌ల్మాన్ ఖాన్ న‌టించిన లేటెస్ట్ మూవీ ప్రేమ్ ర‌త‌న్ ధ‌న్ పాయో తెలుగులో ప్రేమ్ లీలా పేరుతో అనువాదం చేసేప్పుడు స‌ల్లూ భాయ్ మొద‌ట‌గా ఈ సినిమాలో త‌న క్యారెక్ట‌ర్‌కి చ‌ర‌ణ్‌ ని గొంతు అరువివ్వ‌మ‌ని అడిగాడు. చ‌ర‌ణ్ కూడా త‌న స్నేహితుడి కోసం వాయిస్‌ ని ఇచ్చాడు. అత‌డి వాయిస్‌ తో ప్రేమ్ లీల ట్రైల‌ర్‌ లు తెలుగు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకున్నాయి. ఈ మూవీ చూడాల్సిందే అన్న ఉత్సాహాన్నిచ్చాయి. ఇంకా చెప్పాలంటే ప్రేమ లీల మూవీ వారం ఆడిందంటే ఆ వాయిస్ లోని ఎట్రాక్ష‌న్ వ‌ల్ల‌నే. మెగాభిమానులు ఆద‌రించ‌డం వ‌ల్ల‌నే.

అయితే చ‌ర‌ణ్ ఎంత చేసినా ఈ సినిమా ప‌రాజ‌యాన్ని ఆప‌లేక‌పోయాడు. ఆశించిన స్థాయిలో జ‌నాల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌లేక‌పోయారు. ఏదేమైనా స‌ల్మాన్ భాయ్ మూవీ ఫ్లాప్ అన్న టాక్ వ‌చ్చింది. ప్రేమాల‌యం - ప్రేమ పావురాలు రేంజు హిట్టు రాలేదు ఇప్పుడు. అదీ మ్యాట‌రు!