Begin typing your search above and press return to search.
#235 కోట్లు.. షాకిస్తున్న సల్మాన్ `రాధే` డీల్
By: Tupaki Desk | 3 March 2021 2:30 AM GMTబాలీవుడ్ కండల హీరో సల్మాన్ ఖాన్ కి జయాపజయాలతో సంబంధం లేకుండా ట్రేడ్ లో క్రేజు ఉంటుందన్న సంగతి తెలిసిందే. అతడు నటించిన ఇటీవలి సినిమాలు సంచలన విజయాలు సాధించి 500కోట్ల క్లబ్ లో చేరాయి. టైగర్ జిందా హై బ్లాక్ బస్టర్ హిట్. ఆ తర్వాత భారత్- దబాంగ్ 3 నిరాశపరిచినా భాయ్ క్రేజు ఏమాత్రం చెక్కు చెదరలేదు. ప్రస్తుతం పలు క్రేజీ చిత్రాల్లో ఖాన్ నటిస్తున్నారు. రాధే తర్వాత యాంటిమ్.. టైగర్ 3 వంటి భారీ చిత్రాల్లో భాయ్ నటిస్తూ బిజీగా ఉన్నారు.
వీటిలో సల్మాన్ హీరోగా ప్రభుదేవా తెరకెక్కించిన రాధే ఈద్ కానుకగా రిలీజ్ కానుంది. తాజా సమాచారం మేరకు ఈ సినిమాకి బిగ్ డీల్ కుదిరిందని తెలిసింది. ఈ ఒప్పందం విలువ దాదాపు 235 కోట్లు. ప్రఖ్యాత జీ స్టూడియోస్ ఈ డీల్ ని లాక్ చేసింది. గంపగుత్తగా పంపిణీ సహా ఇతర హక్కుల్ని కట్టబెట్టడం చర్చనీయాంశమైంది.
రాధే పంపిణీ వీడియో- డిజిటల్ స్ట్రీమింగ్ సహా మ్యూజిక్ కి సంబంధించిన హక్కులను గంపగుత్తగా ఇంత పెద్ద మొత్తానికి చేజిక్కించుకున్నారని తెలిసింది. తొలిగా థియేట్రికల్ విడుదల చేస్తారు. ఆ వెంటనే జీ 5లో రాధే ప్రసారం అవుతుంది. సల్మాన్ తో జీస్టూడియోస్ కి చాలాకాలంగా సత్సంబంధాలున్నాయి. దానిని మరింత బలోపేతం చేసుకునేందుకే ఇంత పెద్ద డీల్ కుదుర్చుకుందని తెలుస్తోంది.
నిజానికి రాధే చిత్రాన్ని యష్ రాజ్ ఫిల్మ్స్ పంపిణీ చేయాల్సి ఉండగా డీల్ కుదరలేదని తెలిసింది. క్రైసిస్ అనంతరం థియేట్రికల్ రిలీజ్ కి అండగా నిలిచిన సల్మాన్ ఖాన్ కి జీస్టూడియోస్ బాసటగా నిలుస్తోంది. రాధేని దేశవ్యాప్తంగా థియేటర్లలోకి తేవాలన్నది ప్లాన్. మే 20న రిలీజ్ కి వస్తున్న ఈ చిత్రంలో సల్మాన్ తో పాటు రణదీప్ హుడా- దిశా పటాని- జాకీ ష్రాఫ్ తదితరులు నటించారు. ఈ చిత్రం జాన్ అబ్రహం నటిస్తున్న సత్యమేవ జయతే 2 తో బాక్సాఫీస్ వద్ద పోటీపడనుంది.
రాధే టీజర్ ను అక్షయ్ కుమార్ `సూర్యవంశీ`తో థియేటర్లలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. సూర్యవంశీ 2021 ఏప్రిల్ 2న గుడ్ ఫ్రైడే కానుకగా విడుదల కానుంది. క్రైసిస్ అనంతరం బిగ్ రిలీజ్ తో సల్మాన్ ఖాన్ ఎగ్జిబిషన్ రంగంలో ఉత్సాహం నింపడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.