Begin typing your search above and press return to search.

ఆ హీరోతో చరణ్ అనుబంధం ఇప్పటిది కాదట!

By:  Tupaki Desk   |   12 Jan 2022 1:30 AM GMT
ఆ హీరోతో చరణ్ అనుబంధం ఇప్పటిది కాదట!
X
రామ్‌ చరణ్‌ ఇటీవల ఆర్ ఆర్ ఆర్‌ సినిమా ప్రమోషన్స్ కోసం ముంబయి వెళ్లిన సమయంలో ఎప్పటిలాగే సల్మాన్‌ ను కలవడం జరిగింది. ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా ప్రమోషన్‌ లో భాగంగా సల్మాన్ ఖాన్‌ బిగ్ బాస్ లో కూడా చరణ్ పాల్గొన్నాడు. టాలీవుడ్‌ ల్లో సల్మాన్ ఖాన్‌ తో రామ్‌ చరణ్‌ కు అత్యంత సన్నిహిత్యం ఉంది. రామ్‌ చరణ్ ముంబయి వెళ్లిన ప్రతి సారి కూడా సల్మాన్ ను కలవడం లేదా ఆయన ఇంటి నుండి ఫుడ్‌ రావడం కూడా జరుగుతుందట. ఈ విషయాన్ని స్వయంగా రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు. ఇటీవల ఒక టాక్ షో లో పాల్గొన్న రామ్‌ చరణ్ మాట్లాడుతూ సల్మాన్‌ భాయ్‌ తో అనుబంధం ఇప్పటిది కాదంటూ చెప్పుకొచ్చాడు.

సల్మాన్ ఖాన్ మరియు చిరంజీవిలు అప్పట్లో థమ్స్‌ అప్‌ యాడ్‌ లో నటించారు. అప్పట్లోనే సల్మాన్‌ ఖాన్ తో పరిచయం అయ్యిందని చరణ్‌ పేర్కొన్నాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నాన్న తో మరియు నాతో సల్మాన్‌ భాయ్ సన్నిహితంగా ఉంటారు. ఆయన హైదరాబాద్‌ కు వచ్చిన ప్రతి సందర్బంలో కలుస్తూనే ఉంటాము. ప్రతి ప్రత్యేక సందర్బంల్లో కూడా మేము కలవడం జరుగుతుందని చరణ్‌ చెప్పుకొచ్చాడు. అనుబంధంతోనే చిరంజీవి నటిస్తున్న సినిమా లో సల్మాన్ ఖాన్‌ గెస్ట్ గా నటించేందుకు ఓకే చెప్పాడు. మెగాస్టార్‌ సినిమాతో సల్మాన్‌ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అనే విషయం పై అధికారికంగా ప్రకటన రాలేదు కాని ఖచ్చితంగా సల్మాన్ తెలుగు సినిమా ఎంట్రీ చిరు సినిమాతో అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకంగా చెబుతున్నారు.

రామ్‌ చరణ్‌ మరియు సల్మాన్‌ లు కలిసి కూడా ఒక సినిమాలో నటిస్తే బాగుంటుంది అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా ఆ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో విజయం దక్కించుకుంటుందని ప్రతి ఒక్కరు నమ్మకంగా ఉన్నారు. ఇప్పుడు చరణ్‌ ఆర్ ఆర్‌ ఆర్‌ తో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇటీవల విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. ఆ సినిమా విడుదల తర్వాత చరణ్‌ స్థాయి పెరుగుతుంది. దాంతో పాటు శంకర్ సినిమా కూడా విడుదల అయితే మరింతగా చరణ్ స్టార్‌ డమ్‌ పెరుగుతుంది. దాంతో పాన్‌ ఇండియా స్థాయిలో లేదా బాలీవుడ్‌ లో చరణ్ సినిమా ఉండే అవకాశం ఉంది. అప్పుడు సల్మాన్‌ తో కలిసి చరణ్ నటిస్తే బాగుంటుందనే అభిప్రాయం ను కొందరు వ్యక్తం చేస్తున్నారు.