Begin typing your search above and press return to search.
పోలీసుల వద్ద సూపర్ స్టార్ మరో రిక్వెస్ట్
By: Tupaki Desk | 30 July 2022 1:30 AM GMTబాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ చుట్టూ వివాదాలు ఉంటూనే ఉంటాయి. ఆయన వద్దు అనుకున్నా కూడా వివాదాలు మాత్రం ఆయన వెంటే ఉంటాయి. ఆయన అడుగు వేస్తే వివాదం.. చేయి వేస్తే వివాదం అన్నట్లుగా ఒకానొక సమయంలో ఆయన ప్రత్యర్ధులు రాద్దాంతం చేసే ప్రయత్నం చేసేవారు. కాని ఇప్పుడు సల్మాన్ ఖాన్ వాటన్నింటికి దూరంగా ఉండే ప్రయత్నాలు చేస్తున్నాడు.
సల్మాన్ ఖాన్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఆయనపై ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా విమర్శలు చేయడం.. దాడి చేస్తాం అంటూ ప్రకటించడం జరుగుతూనే ఉంది. తాజాగా సల్మాన్ ఖాన్ ను వదిలేది లేదు అంటూ లారెన్స్ బిష్టోయ్ ప్రకటించిన విషయం తెల్సిందే. నల్ల జింకను వేటాడిన కేసులో సల్మాన్ కు క్లీన్ చీట్ వచ్చిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేయడం జరిగింది.
హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో సల్మాన్ ఖాన్ సెక్యూరిటీ విషయంలో సీరియస్ గా పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఇదే సమయంలో సల్మాన్ ఖాన్ కూడా ఇప్పటికే పోలీసు వద్ద లైసెన్స్ తో కూడిన రివాల్వర్ కోసం విజ్ఞప్తి పెట్టుకున్నాడు. తాజాగా మరోసారి పోలీసులను ఆశ్రయించి బుల్లెట్ ఫ్రూప్ అద్దాలను తన కారు కు పెట్టుకునేందుకు అనుమతి ని కోరాడు.
బుల్లెట్ ఫ్రూప్ అద్దాలతో కూడిన కార్లు ఇండియాలో చాలా తక్కువగా ఉంటాయి. బుల్లెట్ ఫ్రూప్ అద్దాలు కావాలంటే పోలీసుల నుండి తప్పనిసరిగా అనుమతి అవసరం.
అందుకే సల్మాన్ ఖాన్ తనకు ఉన్న ప్రమాదం నేపథ్యంలో బుల్లెట్ ఫ్రూప్ అద్దాలతో కూడిన కారు అవసరం అని.. అందుకే తన కారుకు బుల్లెట్ ఫ్రూప్ అద్దాలను ఏర్పాటు చేసుకునేందుకు గాను అనుమతించాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారట.
ఇప్పటికే సల్మాన్ ఖాన్ కు ప్రైవేట్ సెక్యూరిటీతో పాటు ప్రభుత్వం కూడా పోలీసులతో సెక్యూరిటీ ఇస్తుంది. తాజా హెచ్చరికల నేపథ్యంలో మరింత సీరియస్ గా సల్మాన్ ఖాన్ యొక్క సెక్యూరిటీని పర్యవేక్షిస్తున్నట్లుగా అధికారులు ప్రకటించారు. సల్మాన్ ఖాన్ కోరిన బుల్లెట్ ఫ్రూప్ కు కూడా పోలీసులు ఓకే చెప్పే అవకాశం ఉంది