Begin typing your search above and press return to search.

ఆవిడతో రొమాన్స్‌లో.. ఆయన గుర్తొచ్చాడు

By:  Tupaki Desk   |   6 July 2015 7:10 AM GMT
ఆవిడతో రొమాన్స్‌లో.. ఆయన గుర్తొచ్చాడు
X
సల్మాన్‌ ఖాన్‌-కరీన పూర్‌ ఖాన్‌ జంటగా నటించిన భజరంగి భైజాన్‌ ఈ రెండో వారంలో రిలీజ్‌కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. హిందువుల మనోభావాల్ని కించపరిచేలా ఈ చిత్రంలో ఓ పాట ఉందని ఇటీవల వివాదం చెలరేగింది. మరో ప్రత్యేక గీతాన్ని (ఆజ్‌ కి పార్టీ తేరీ ...)రిలీజ్‌ చేస్తున్న సందర్భంగా సల్మాన్‌ చాలా ఆసక్తికర సంగతులు చెప్పుకొచ్చాడు.

=భజరంగి.. పూర్తి పాజిటివ్‌ సినిమా. కుల, మతాల్ని విమర్శించే ఎపిసోడ్స్‌ లేనేలేవు. ఎక్కడా అలాంటివాటిని టచ్‌ చేయలేదు. మంచిని భోధించే చిత్రమిది.

=ఈ చిత్రంలో కరీనా అద్భుతంగా నటించింది. అయితే తనతో రొమాన్స్‌ చేసే ప్రతి సందర్భంలో సైఫ్‌ గుర్తొచ్చేవాడు. కరీనా 'ఖాన్‌' అన్న పిలుపు బాగానే ఉంది. (నవ్వేస్తూ)

=మత సంబంధమైన విషయాల్లో ఆయా సంస్థలు వివాదాలకు కారణమైనా అవేవీ తనని బాధపెట్టలేదని అన్నాడు.

=సంజయ్‌దత్‌ పెరోల్‌లో జైలు నుంచి వస్తున్నాడు. అప్పుడు అతడితో కలిసి పార్టీ చేసుకునేది లేదు. ఎందుకంటే అతడి జైలు ఇంకా ముగియలేదు. ముగిశాక మాత్రం ఘనంగా పార్టీ చేసుకుంటాం. అతడి వెంటే మేమంతా ఉన్నాం.