Begin typing your search above and press return to search.

సల్మాన్‌ ప్రేయసికి ఆల్రెడీ పెళ్ళయ్యింది

By:  Tupaki Desk   |   16 May 2016 3:30 PM GMT
సల్మాన్‌ ప్రేయసికి ఆల్రెడీ పెళ్ళయ్యింది
X
రొమానియన్‌ మోడల్‌ లూలియా వాంటూర్‌ తో చెట్టాల్‌ పట్టాల్‌ అంటూ పడుచు కుర్రాడిలా తిరిగేస్తున్నాడు 50 ఏళ్ళ సూపర్ స్టార్‌ సల్మాన్ ఖాన్‌. బాగుందబ్బా. అయితే ఇంతకీ ఈయన ఎలాగైతే చాలామందితో ప్రేమ వ్యవహారాలు నడిపి బ్రేకప్‌ చేసుకున్నాడో.. లూలియా కూడా అలాగే పెళ్ళి చేసుకుని మరీ డైవర్స్ ఇచ్చేసిందట.

రొమానియేకే చెందిన మ్యారియస్‌ మొగా అనే సంగీత దర్శకుడు, ఫిలిం డైరక్టర్ ను.. 2007లో పెళ్ళి చేసుకుందట లూలీయా. వారి పెళ్లి తాలూకు ఫోటోలు చూస్తుంటే.. చర్చిలో అంగరంగ వైభవంగా వారి వివాహం జరిగిందని అర్ధమవుతోంది. అయితే చేసుకున్న రెండు సంవత్సరాల్లోనే ఆ జంట విడిపోయింది. అయితే వీరిద్దరూ చర్చిలో పెట్టుకున్న పెదాల ముద్దు.. అలాగే తరువాత దిగిన అనేక హగ్గుల ముద్దుల ఫోటోలు ఇప్పుడు ఇండియాలో హాట్ టాపిక్‌ అయిపోయాయ్‌. ఇక 2009 తరువాత అమ్మడు మరో యురోపియన్‌ బిలియనీర్‌ ను కూడా డేటింగ్‌ చేసిందట.

సర్లేండి.. మన సల్లూకి లేవా బ్యాక్‌ స్టోరీలు. ఎవరి స్టోరీలు వారికే ఉంటాయ్‌. ఇంతకీ సల్లూ అండ్‌ లూలియా పెళ్ళెప్పుడో మరి?