Begin typing your search above and press return to search.

మూడో పెళ్లిపై సల్మాన్ కామెంట్

By:  Tupaki Desk   |   13 Jun 2017 4:47 PM GMT
మూడో పెళ్లిపై సల్మాన్ కామెంట్
X
సినిమా తారలు ఒకరిని ఒకరు మాటలు అనుకోవడం అంతగా కనిపించదు. హీరోయిన్స్ అయినా అప్పుడప్పుడూ నోరు జారుతుంటారు కానీ.. హీరోలు ముఖ్యంగా స్టార్ హీరోలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటారు. చివరకు ప్రెస్ మీట్స్ లో కూడా ఫలానా టాపిక్స్ పైనే క్వశ్చన్స్ అడగాలని కండిషన్స్ పెడుతుంటారు.

ఈ మధ్య కాసింత ట్రెండ్ మారుతోంది. రీసెంట్ సల్మాన్ ఖాన్ పై మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎలాగైనా తన చిరకాల మిత్రుడు అయిన కండలవీరుడికి పెళ్లి చేసేసి కాళ్లు చేతులు కట్టేయాలని అనుకుంటున్నట్లు చెప్పి.. సల్మాన్ పెళ్లిపై కామెంట్ చేశాడు ఆమిర్ ఖాన్. మరి ఇలాంటి వ్యాఖ్యలు చేశాక ఆ మాటలు సల్లూ భాయ్ దగ్గరకు వెళ్లకుండా ఉంటాయా? మరి దీనికి సల్మాన్ నుంచి కూడా సమాధానం రావాలి కదా.. వచ్చింది.. అది కూడా ఇంకా స్ట్రాంగ్ గా వచ్చేసింది. సల్మాన్ అసలు పెళ్లి చేసుకోకపోవడంపై ఆమిర్ కామెంట్ చేస్తే.. ఈ హీరో రెండు పెళ్లిళ్లు చేసుకోవడాన్ని ఉద్దేశించి పంచ్ వేశాడు సల్మాన్ ఖాన్.

'నేను ఆమిర్ అన్న మాటలను విన్నాను. నాకు పెళ్లి చేసి కాళ్లు చేతులు కట్టేద్దామని అనుకుంటున్నాడు నా ఫ్రెండ్స్. నేను మాత్రం ఆమిర్ ఖాన్ తన జీవితంలో మూడోసారి పెళ్లి చేసుకోకుండా కాళ్లు చేతులు కట్టేద్దామని అనుకుంటున్నా' అన్నాడు సల్లూ భాయ్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/