Begin typing your search above and press return to search.
చైనాలో భాయ్ ఏం చేస్తాడో చూద్దాం
By: Tupaki Desk | 3 March 2018 11:53 AM GMTసల్మాన్ ఖాన్ కెరీర్ లో చెప్పుకోదగ్గర సినిమా బజరంగీ భాయిజాన్. భారత్... పాక్ మధ్య ఉన్న వివాదాల నేపథ్యంలో తీసిని సినిమా. పాక్ కు చెందిన పాపని... వారి తల్లిదండ్రుల దగ్గరికీ తిరిగి చేర్చే కథలో సల్మాన్ ఖాన్ సూపర్ గా నటించాడు. మనదేశంలో హిట్ కొట్టి 320 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇప్పుడు ఆ సినిమా చైనాలో విడుదలైంది.
బజరంగీ భాయిజాన్ సినిమా మన దేశంలో విడుదలై రెండేళ్లు అయిపోయింది. ఇప్పుడు ఆ సినిమా చైనాలోకి డబ్ అయ్యింది.. మార్చి 2న ఆ దేశంలో విడుదలైంది. అక్కడ ఈ సినిమా ఏమాత్రం వసూలు చేస్తుందో చూడాలి. ఇంతకుముందు అమీర్ ఖాన్ సినిమాలే ఎక్కువగా చైనాలో విడుదలయ్యేవి. దంగల్... సూపర్ స్టార్ సినిమాలు విడుదలై మంచి వసూళ్లను సాధించాయి. ఇప్పుడు సల్మాన్ ఖాన్ అతని బాటలోనే సాగుతున్నాడు. దంగల్.. రెజ్లింగ్ ఆట నేపథ్యంలో సాగే సినిమా. మహవీర్ ఫోగట్... అతని కూతుళ్లు గీతా ఫోగట్.. బబితా కుమారిల జీవిత కథ. ఈ సినిమా ఒక్క చైనాలో 1200 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే అమీర్ ఖాన్ మరో సినిమ సూపర్ స్టార్ .. ఇండియాలో పెద్దగా ఆడలేదు కానీ... చైనాలో బాగా వసూలు చేసింది. మనదేశంలో కేవలం 64 కోట్ల రూపాయలే వసూలు చేసిన ఈ సినిమా... చైనాలో మాత్రం 700 కోట్లకు పైగా వసూలు చేసింది.
ఇప్పుడు బజరంగీ భాయిజాన్ చైనాలో ఎంట్రీ ఇచ్చింది. దంగల్ రికార్డులను బద్దలు చేసేలా వసూళ్లు సాధిస్తుందో... లేదో చూడాలి. ఈ సినిమా మంచి వసూళ్లు సాధిస్తే.. ఇక సల్మాన్ ఖాన్ సినిమాలు కూడా చైనాలో విడుదలకు సిద్దమైపోతాయి. అమీర్...సల్మాన్ లను చూసి... మిగతా బాలీవుడ్ హీరోలు కూడా చైనా బాట పడతారేమో.