Begin typing your search above and press return to search.
వావ్!! లక్కీ బ్రేస్ లెట్, గద లాకెట్
By: Tupaki Desk | 10 Aug 2015 4:02 PM GMTభాయిజాన్ వెండితెరపైనే కాదు ఇ- మార్కెటింగ్ లోనూ సూపర్ హిట్. ఈ సినిమాలో గద ఆకారంలో ఉన్న ఓ పెండెంట్ ని మెడలో వేసుకున్న సల్మాన్ యువతరాన్ని క్లీన్ బౌల్డ్ చేసేశాడు. హనుమాన్ భక్తుడి(సల్మాన్) మెడలో వేలాడుతున్న లాకెట్ పైనే యూత్ కళ్లు పడ్డాయి. సరిగ్గా ఈ పాయింట్ ని క్యాష్ చేసుకునేందుకు అమెజాన్ డాట్ కాం వేసిన ఎత్తుగడ ఫలించింది. పెండెంట్ పేరుతో కోట్లాది రూపాయల ఆన్ లైన్ మార్కెటింగ్ చేసింది ఈ సంస్థ. ఆన్ లైన్ లో లాకెట్ వెళ రూ.200 -300 అంటూ ఊరించి హాట్ కేక్ లా సేల్ చేసింది.
సల్మాన్ కెరీర్ లో ఇలాంటి ఛమక్కులెన్నో. అప్పట్లో సల్మాన్ నటించిన దబాంగ్ చూశాక పోలీసుల్లో బోలెడంత మార్పొచ్చింది. రియల్ కాప్ సైతం దబాంగ్ స్టయిల్ ని అనుకరించారు. మీసకట్టు, యూనిఫాం సేమ్ టు సేమ్ దించేశారు. ఏక్ థా టైగర్ లో ఓ స్కార్ప్ ని ముఖానికి తగిలించుకుని సీక్రెట్ (రా) ఏజెంట్ గా కనిపించాడు. ఆ సినిమా రిలీజ్ తర్వాత కెఫియా పేరుతో ఆ రకం స్కార్ప్ లు తెగ అమ్ముడు పోయాయి. జయహో ట్రైలర్ లో సల్మాన్ బ్రేస్ లెట్ చూసిన యువతరం పిచ్చెక్కి పోయింది. సేమ్ బ్రేస్ లెట్ కోసం జువెలరీ షాపుల మీద పడ్డారంతా.
తేరే నామ్ చిత్రంలో సల్మాన్ భాయ్ మిడిల్ పాపిడి యువతరంలో బాగా ఫేమస్ అయ్యింది. కొబ్బరినూనె రాసుకున్న తలతో తిరిగారంతా. .. ఇలా చెప్పుకుంటే భాయ్ ని అనుసరించడంలో యూత్ ఎప్పుడూ ముందుంటుంది. ఆ క్రేజే అలాంటిది మరి.