Begin typing your search above and press return to search.
సుల్తాన్.. మస్తీలకు పైరసీ దెబ్బ!!
By: Tupaki Desk | 6 July 2016 10:01 AM GMTవిడుదలకు ముందే ఇంటర్నెట్ లో సినిమా లీకయ్యే సంఘటనలు పెరిగిపోతున్నాయి. గత నెలలో ఉడ్తాపంజాబ్ ఈ సమస్యను ఎదుర్కోగా.. ఇప్పుడు లేటెస్ట్ రిలీజ్ లకు కూడా ఈ బెడద వచ్చి పడింది. బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ సుల్తాన్ ఇవాళ థియేటర్లలోకి వచ్చింది. అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ రిపోర్టులు వస్తుండగా.. ముందు రోజే నెట్ లో దర్శనమిచ్చిందనే వార్తలు బాలీవుడ్ ని కుదిపేశాయి.
సుల్తాన్ పైరసీకి సంబంధించి నిర్మాతల నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. అయితే.. సుల్తాన్ సినిమాకి సంబంధించిన స్క్రీన్ షాట్స్ నెట్ లో కనిస్తున్నాయి. దీనికి సంబంధించి సైబర్ క్రైమ్ అధికారులు మాత్రం.. ఆన్ లైన్ లో పైరసీ కాపీ మాటను ధృవీకరించారు. అలాగే.. సినిమా నిడివి 2 గంటల 36 నిమిషాల కాపీ టోరెంట్ సైట్లలో లభ్యవుతోందని చెబుతున్నారు. అనేక సైట్లలో లింక్స్ ని ఇప్పటికే బ్లాక్ చేయగా.. ఈ లీక్ కి సంబంధించి పరిశోధన జరుగుతోంది. మరోవైపు జూలై 22న విడుదల కావాల్సి ఉన్న గ్రేట్ గ్రాండ్ మస్తీ కి సంబంధించిన సెన్సార్ కాపీ నెట్ లో లీక్ అయిపోయింది.
గ్రేట్ గ్రాండ్ మస్తీ విడుదలకు ఇంకా 16 రోజుల సమయం ఉండగానే.. కాపీ లీక్ అవడంతో.. ఈ చిత్రానికి నష్టం భారీగా ఉండనుంది. ఇప్పటికే రిలీజ్ డేట్ ను ప్రీపోన్ చేసి జూలై 15న విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. నెల రోజుల వ్యవధిలో మూడు సినిమాలు రిలీజ్ కంటే ముందే నెట్లో కనిపించడం.. బాలీవుడ్ ని భారీ షాక్ కి గురి చేసింది.