Begin typing your search above and press return to search.
పీకే.. కాచుకో అంటున్న సుల్తాన్
By: Tupaki Desk | 13 July 2016 7:28 AM GMTకలిసొచ్చిన కాలంలో మాంచి సినిమా పడేసరికి సల్మాన్ ఖాన్ చెలరేగిపోతున్నాడు. బాక్సాఫీస్ రికార్డుల అంతు చూస్తున్నాడు. ఫస్ట్ డే కలెక్షన్ల రికార్డు చేజారినా.. వీకెండ్ రికార్డుల్ని మాత్రం భారీ తేడాతో బద్దలు కొట్టేసింది ‘సుల్తాన్’ సినిమా. భారతీయ సినీ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో తొలి వారాంతంలోనే ఏకంగా రూ.180 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించిందీ సినిమా. అంతే కాదు.. ఏడు రోజుల్లోనే రూ.200 కోట్ల నెట్ వసూళ్లు సాధించి రికార్డు నెలకొల్పింది. ఇండియాస్ హైయెస్ట్ గ్రాసర్ ‘పీకే’ ఈ ఘనత సాధించడానికి 9 రోజులు తీసుకుంది. దాంతో పాటు సల్మాన్ సినిమా ‘భజరంగి భాయిజాన్’.. ‘ధూమ్-3’ కూడా ఏడు రోజుల్లోనే రూ.200 కోట్ల మార్కును టచ్ చేశాయి.
వీకెండ్ తర్వాత సోమవారం కూడా వసూళ్లు స్టడీగానే ఉండటంతో ‘సుల్తాన్’ ఇండియాస్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అమీర్ సినిమా ‘పీకే’ రూ.740 కోట్ల గ్రాస్ వసూళ్లతో అగ్రస్థానంలో ఉంది. కంటెంట్ ఉన్న సినిమా కావడంతో ‘సుల్తాన్’ కూడా ‘పీకే’ తరహాలోనే కనీసం నెల రోజుల పాటు హవా సాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే నెల మొహెంజదారో.. రుస్తుమ్ సినిమాలు వచ్చేవరకు ‘సుల్తాన్’ జోరు కొనసాగే అవకాశాలున్నాయి. మన దేశంలోనే కాక.. విదేశాల్లో సైతం ‘సుల్తాన్’ హవా కొనసాగుతోంది. ఇప్పటికే విదేశాల్లో ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయడం విశేషం.