Begin typing your search above and press return to search.
సుల్తాన్.. బ్రేకప్ సెంటిమెంట్..
By: Tupaki Desk | 16 March 2016 3:30 PM GMTబాలీవుడ్ లో హీరోయిన్లకు లిఫ్ట్ ఇవ్వడంలో సల్మాన్ ఖాన్ కి మంచి ట్రాక్ రికార్డే ఉంది. ఐశ్యర్యారాయ్ నుంచి కత్రినా కైఫ్ వరకూ సల్మాన్ టచ్ చేశాక టాప్ రేంజ్ కి వెళ్లిన భామల జాబితా చాంతాడంత ఉంటుంది. అయితే.. ఇప్పుడు కండలవీరుడి ఓ సినిమా బ్రేకప్ లకు వేదిక అవుతోందనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం సుల్తాన్ మూవీ షూటింగ్ లో బిజీబిజీగా ఉన్నాడు సల్లూభాయ్. ఇందులో అనుష్క శర్మ హీరోయిన్ గా నటిస్తోంది.
అసలు ఈ మూవీలో హీరోయిన్ గా నటించేందుకు సల్మాన్ ఫస్ట్ ఆప్షన్ అనుష్క కాదనే విషయం ఇప్పుడు బయటకొచ్చింది. నిజానికి కత్రినా కైఫ్ తో ఈ రోల్ చేయించాలని కండలవీరుడు భావించాడట. కానీ అప్పటికే రణ్ బీర్ తో డేటింగ్ చేస్తున్న ఈ సుందరాంగి.. సల్మాన్ ఆఫర్ ను తోసి పుచ్చింది. చివరకు అనుష్కశర్మను తీసుకుని సినిమా చేస్తున్నాడు ఈ హీరో. కానీ సుల్తాన్ కి ఫస్ట్ ఆప్షన్ అయిన కత్రినా కైఫ్.. తన ప్రియుడు రణ్ బీర్ కపూర్ కి ఇప్పుడు బ్రేకప్ చెప్పేసింది. అలాగే ఇప్పుడు హీరోయిన్ గా నటిస్తున్న అనుష్క శర్మ కూడా తన ప్రియుడు విరాట్ కోహ్లీతో కటీఫ్ అయిపోయింది.
ఇలా సుల్తాన్ కి హీరోయిన్ గా అనుకున్న ఇద్దరు భామలకు రియల్ లైఫ్ చెడిపోవడం ఆశ్చర్యకరమైన విషయమే. రెండు బ్రేకప్ ల వెనక సల్మాన్ ఖాన్ హ్యాండ్ ఏ మాత్రం ఉందో చెప్పడం కష్టమే కానీ.. కండల వీరుడి హ్యాండ్ పడితే మాత్రం బ్రేకప్ ఖాయమైపోతోంది.