Begin typing your search above and press return to search.

నాలుగు రోజుల్లోనే బాహుబలిని కొట్టేశాడు

By:  Tupaki Desk   |   11 Nov 2017 8:40 AM GMT
నాలుగు రోజుల్లోనే బాహుబలిని కొట్టేశాడు
X
బాలీవుడ్ లో హీరోలు కలుసుకున్నప్పుడు పైకి నవ్వుతూ ఉన్నా మనసుల్లో కనిపించని పోటీ యుద్దాలు బాగానే జరుగుతుంటాయి. అక్కడి హీరోలు ఏ మాత్రం ఒక రికార్డును బద్దలు కొట్టినా మరొక స్టార్ హీరో ఆ రికార్డును బ్రేక్ చెయ్యాలని చూస్తాడు. కానీ ఇప్పుడు అందరు బాలీవుడ్ హీరోలు టాలీవుడ్ బాహుబలి రికార్డ్స్ పై కన్నేశారు. ఎలాగైనా బాహుబలి రికార్డులను దాటాలని ప్రతి విషయంలో పోటీ పడుతున్నారు.

అయితే రీసెంట్ గా ట్రైలర్ తో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ బాహుబలి రికార్డును దాటేశాడు. బాలీవుడ్ లో బాహుబలి రెండు భాగాలు విడుదలైన సంగతి తెలిసిందే. అయితే సెకండ్ పార్ట్ ట్రైలర్ అత్యధిక లైకులతో యూట్యూబ్ లో రికార్డ్ సృష్టించింది. మొత్తంగా 5,41,000 లైకులు రాగా సల్మాన్ తన టైగర్ జిందా హై ట్రైలర్ తో నాలుగు రోజుల్లో ఆ రికార్డును బద్దలు కొట్టాడు. అలీ అబ్బాస్ జాఫర్ తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్ మంగళవారం రిలీజ్ కాగా ఇప్పటివరకు 6,48,000 లైకులను సొంతం చేసుకుంది.

ఏక్తా టైగర్ సినిమాకు సీక్వెల్ గా వస్తోన్న ఈ సినిమాలో సల్మాన్ తో పాటు కత్రినా కూడా నటిస్తోంది. సినిమాలో సల్మాన్ కొత్తగా కనిపిస్తున్నాడు. అంతే కాకుండా యాక్షన్ సీన్స్ కూడా హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. సల్మాన్ కెరీర్ లోనే ఎంతో ప్రతిష్ఠాత్మకంగా యష్ రాజ్ ఫిలిమ్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. వచ్చే నెల సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయాలనీ నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.