Begin typing your search above and press return to search.

పెళ్ళి గురించి అడిగితే కోపమొచ్చింది!!

By:  Tupaki Desk   |   21 May 2016 5:31 AM GMT
పెళ్ళి గురించి అడిగితే కోపమొచ్చింది!!
X
అసలే పెళ్లిళ్ళ సీజన్‌. బాగా ఏజ్‌ బారు అయిపోతున్న ప్రీతి జింతా.. అలాగే మన బిపాసా బసు.. వగైరా వగైరా సెలబ్రిటీలు అందరూ పెళ్ళాడేస్తున్నారు. కాని బ్యాచిలెర్‌ నెం.1 అనే టైటిల్‌ ను గత కొన్నేళ్లుగా తనే వాడుకుంటున్న సల్మాన్‌ ఖాన్‌ మాత్రం ఇంకా నిక్కా పక్కా చేసుకోలేదు. అతగాడికి పెళ్ళవుతోంది అని ఎన్ని రూమర్లు వస్తున్నా కూడా.. మనోడు మాత్రం వాటిలో నిజం లేదంటున్నాడు.

ఇక నిన్న సాయంత్రం ఐఫా అవార్డుల ప్రెస్ మీట్‌ లో.. మీ పెళ్లి జరుగబోతోందంటగా అని సల్లూ భాయ్‌ ని అడిగితే.. మనోడు వెంటనే కోప్పడ్డాడు. ''నా పెళ్ళి ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుంది. మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే నా అభిమానులకు మాత్రం చెబుతాను. వారి కోసం ఒక ట్వీట్‌ వేయడమో.. లేదా ఫేస్ బుక్‌ లో పోస్టు చేయడమో చేస్తాను'' అంటూ బదులిచ్చాడు భాయ్‌. సారు వారికి.. పెళ్ళి గురించి అడిగితే అంత కోపమెందుకో?

ఈ మధ్యన సల్లూ తన ఫ్యామిలీతో ఎక్కడ కనిపించినా కూడా పక్కనే రొమానియన్‌ మోడల్‌ లూలియా వాంటూర్‌ కూడా కనిపిస్తోంది. అమ్మడిని మనోడు ఈ సంవత్సరం డిసెంబర్‌ లో పెళ్లాడతాడని టాక్‌. అయితే ఈలోపు ఆమెకు ఇప్పటికే పెళ్ళయి డైవర్స్ అయ్యింది అనే న్యూస్ ను మీడియా ఎక్సక్లూజివ్‌ గా రాయడంతో.. మనోడు హర్టయ్యాడంట.