Begin typing your search above and press return to search.

కాఫీ 100వ ఎపిసోడ్: ఆ డేర్ చేస్తాడా??

By:  Tupaki Desk   |   2 Dec 2016 9:30 AM GMT
కాఫీ 100వ ఎపిసోడ్: ఆ డేర్ చేస్తాడా??
X
కాఫీ విత్ కరణ్.. సెలబ్రిటీలు-స్టార్లతో దర్శకుడు కరణ్ జోహార్ నిర్వహించే ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా చాలా పాపులర్. ఇప్పటికి 4 సీజన్ లు పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం ఇప్పుడు ఐదో సీజన్ నడుస్తోంది. తనే డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ కావడం.. అందరితో వ్యక్తిగతంలో స్నేహం ఉండడంతో.. జనాలకు తెలియని ఎన్నో ప్రశ్నలను డైరెక్టుగా అడిగేస్తుంటాడు కరణ్.

ఇప్పుడు ఐదు సీజన్లు కలుపుకుంటే.. కాఫీ విత్ కరణ్ వందో ఎపిసోడ్ ప్రసారం కాబోతోంది. ఈ ఎపిసోడ్ కు సల్మాన్ ఖాన్ బ్రదర్స్ ను ఆహ్వానించాడు కరణ్. కండలవీరుడు సల్మాన్ ఖాన్ తోపాటు అతని ఇద్దరు సోదరులు అయిన అర్బాజ్ ఖాన్-సోహైల్ ఖాన్ లు కూడా ఈ వందో ఎపిసోడ్ లో పాల్గొంటున్నారు. మరి ఇక్కడ వీళ్లను ఎలాంటి ప్రశ్నలు కరణ్ అడుగుతాడనే ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం సల్మాన్-యూలియా వంతూర్ ల మధ్య జరుగుతున్న ప్రేమాయణం ముదిరి పాకాన పడిన సంగతి తెలిసిందే. మరి సల్మాన్ ను పెళ్లి గురించి అడిగి సమాధానం రాబడతాడా?

అలాగే అర్బాజ్ ఖాన్ తన భార్య మలైకా అరోరా ఖాన్ కు విడాకులు ఇస్తున్నాడు. రీసెంట్ గానే కోర్టు ద్వారా కౌన్సిలింగ్ పొందారు ఈ జంట. ఇప్పుడు కరణ్.. అర్బాజ్ విడాకులకు అసలు కారణం రాబట్టగలుగుతాడా అనేది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. వీటికి సమాధానం తెలియాలంటే మాత్రం కాఫీ విత్ కరణ్ 100వ ఎపిసోడ్ మిస్ కాకూడదులే!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/