Begin typing your search above and press return to search.

చైనాపై గెలిచేందుకు సల్మాన్ సన్నాహాలు

By:  Tupaki Desk   |   10 March 2017 4:33 AM GMT
చైనాపై గెలిచేందుకు సల్మాన్ సన్నాహాలు
X
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమాలకు చైనా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఇప్పటికే సల్లూ భాయ్ సినిమాలు తెగ ఆడేస్తాయ్ అక్కడ. మళ్లీ ఇప్పుడు చైనాపై గెలవడమేంటి అనే డౌట్ రెయిజ్ రావడం కరెక్టే కానీ.. ఈసారి చైనాను దెబ్బ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు సల్మాన్.

దేశంలో ఇప్పుడు స్మార్ట్ ఫోన్లకు ఎంత గిరాకీ ఉందనే విషయం తెలిసిందే. వీటిలో చైనా ఫోన్లదే హవా. షియోమీ.. ఒప్పో.. వీవో లాంటి చైనా బ్రాండ్లు రాజ్యం చేసేస్తున్నాయి. ఈ మార్కెట్ ను చైనా నుంచి లాగేసుకుని.. ఇండియాకు కట్టబెట్టేయాలని.. తద్వారా అటు దేశానికి సేవ చేయడంతో పాటు.. ఇటు పర్సనల్ గా కూడా లాభం పొందాలని చూస్తున్నాడు సల్మాన్ ఖాన్. ఇప్పటికే 'బీయింగ్ హ్యూమన్' అనే పేరుతో పలు ఉత్పత్తులను విక్రయిస్తున్న సల్మాన్.. ఇప్పుడు 'బీయింగ్ స్మార్ట్' బ్రాండ్ పై స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు చేపట్టనున్నాడట. ఇందుకోసం మేనేజ్మెంట్ టీం కూడా ఇప్పటికే సిద్ధం కాగా.. త్వరలోనే సల్మాన్ ఫోన్లు మార్కెట్లోకి రాబోతోన్నాయి కూడా.

15-20వేల రూపాయల రేంజ్ లో మీడియం బడ్జెట్ సెగ్మెంట్ లో అల్ట్రా హై ఎండ్ ఫోన్లను అందించాలనేది సల్మాన్ యోచనగా తెలుస్తోంది. రెండేళ్ల క్రితమే పలు కంపెనీలతో కలిసి సల్మాన్ ఇందుకోసం ప్రయత్నాలు చేయగా.. అప్పట్లో రాయల్టీ విషయంలో లెక్కలు సెట్ కాలేదు. అందుకే తనే ఓ బ్రాండ్ అండ్ కంపెనీలను మొదలుపెట్టేసి.. దేశీయ మార్కెట్లోకి ఫోన్లు వదిలేసి.. చైనాను దెబ్బకొట్టేసేందుకు రెడీ అవుతున్నాడు సల్లూ భాయ్. ఈ ఏడాది దసరా నాటికి సల్మాన్ ఫోన్లు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/