Begin typing your search above and press return to search.
సర్దార్ కి సల్మాన్ ప్రమోషన్స్
By: Tupaki Desk | 16 March 2016 1:30 PM GMTసర్దార్ గబ్బర్ సింగ్ ను హిందీలో డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేస్తూ.. బాలీవుడ్ లో అడుగు పెడుతున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇప్పటివరకూ బాలీవుడ్ పై ఒక్క మాట కూడా మాట్లాడని పవన్.. ఒక్కసారిగా అక్కడ ఎంట్రీ ఇచ్చేయాలని డిసైడ్ చేయడమే ఆశ్చర్యకరం. సర్దార్ మూవీ ఇలా హిందీ వెర్షన్ రిలీజ్ కు అసలు కారణం.. ఈరోస్ సంస్థ చేసిన ఒత్తిడి అని తెలుస్తోంది.
అయితే.. సౌతిండియా నుంచి బాలీవుడ్ వెళ్లి సక్సెస్ అయిన తెలుగు హీరోలెవరూ లేరు. చిరు ఫ్యామిలీలోనే భారీ బాలీవుడ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. అయితే, ఇక్కడ పవన్ తీసుకుంటున్న ఓ జాగ్రత్తను మాత్రం పొగడాల్సిందే. అక్కడ భారీ ఎత్తున సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ అవుతున్నా.. ఇది డైరెక్ట్ మూవీ కాదు. తెలుగు వెర్షన్ తో పాటే ఒకేసారి రిలీజ్ చేస్తున్నారంతే. అక్కడ ఫెయిల్ అయితే అని ఫ్యాన్స్ అందోళన చెందుతున్నా.. ఇప్పటికైతే హిందీ వెర్షన్ రిలీజ్ మాత్రం ఫిక్స్ అయిపోయింది. అయితే.. సర్దార్ గబ్బర్ సింగ్ హిందీ వెర్షన్ ప్రచారానికి, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ రానున్నాడన్నది లేటెస్ట్ టాక్.
అసలు గబ్బర్ సింగ్ మూవీనే.. సల్మాన్ దబాంగ్ కి రీమేక్. ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ మాత్రం, దబాంగ్2 కాదు. దీన్ని దబాంగ్ న్యూ వెర్షన్ అనే యాంగిల్ లో ప్రచారం చేయాలని యూనిట్ అనుకుంటోందట. అలా దబాంగ్ పేరుతో ప్రచారం చేస్తే, తన ఐడెంటిటీకి సమస్య కాబట్టి.. సల్మాన్ వరకూ ఓకే.. దబాంగ్ మాత్రం వద్దు అంటున్నాడట పవన్.