Begin typing your search above and press return to search.
కండలే కాదు కాసుల్లోనూ నెంబర్ వన్
By: Tupaki Desk | 5 Dec 2018 9:11 AM GMTబాలీవూడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కం కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు మరో రికార్డు వచ్చి చేరింది. కాకపోతే సినిమాల గురించి కాదు సంపాదన విషయంలో. ఫోర్బ్స్ ప్రకటించిన అత్యంత అధిక సంపాదన కలిగిన సెలెబ్రిటీస్ లో సల్మాన్ 253 కోట్లతో ఫస్ట్ ప్లేస్ లో నిలిచాడు. ఒక రకంగా చూస్తే సెలవులు ఆదివారాలు పండగలు ఇలా ఓ వంద రోజులు పక్కన పెట్టి కేవలం వర్కింగ్ డేస్ లెక్కలో చూసుకుంటే సల్మాన్ రోజువారీ సంపాదన కోటి ఉన్నట్టేగా. బాప్ రే అనిపిస్తోంది కదూ. అంత మొత్తాన్ని ఏడాదికి సంపాదించడమే కోట్లాది భారతీయులకు నిద్రలో మాత్రమే సాధ్యమయ్యే కల.
అలాంటిది సల్మాన్ ఈ రేస్ లో ఫస్ట్ రావడం అంటే మాములు విషయమా. తర్వాత ప్లేస్ విరాట్ కోహ్లీ తీసుకున్నారు. ఏడాదికి 228 కోట్ల ఆదాయంతో సల్మాన్ కు మరీ దూరంలో అయితే లేడు. తర్వాతి ప్లేస్ 2.0 పక్షి రాజా అక్షయ్ కుమార్ కొట్టేసాడు. సంవత్సరానికి 185 కోట్లతో ఇతగాడి దూకుడు తక్కువేమి లేదు. నెక్స్ట్ దీపికా పదుకునే అలా లిస్ట్ సాగుతూ పోయింది. విచిత్రం ఏంటంటే కింగ్ బాద్షాగా పిలువబడే షారుఖ్ ఖాన్ మాత్రం కేవలం 56 కోట్లతో టాప్ 10లో స్థానాన్ని పోగొట్టుకున్నాడు. ఆ మధ్య వరస పరాజయాలతో పాటు నిర్మాతగా కూడా దెబ్బ తినడం షారుఖ్ బ్రాండ్ కి డ్యామేజ్ చేసింది. అందుకే లేట్ ఏజ్ లో చాలా రిస్క్ చేసి మరీ జీరో సినిమాతో వస్తున్నాడు.
బాక్స్ ఆఫీస్ దగ్గరే కాదు ఫోర్బ్స్ లెక్కల్లో కూడా తమ హీరోనే నెంబర్ వన్ గా నిలవడం చూసి సల్లు ఫ్యాన్స్ ఆనందం మాములుగా లేదు. సల్మాన్ కొత్త సినిమా భరత్ షూటింగ్ ప్రస్తుతం కీలక దశలో ఉంది. వచ్చే ఏడాది రంజాన్ పండగ కానుకగా రెడీ అవుతున్న భరత్ లో కత్రినా కైఫ్ హీరోయిన్. సల్మాన్ కు ఈ ఏడాది రేస్ 3 పెద్ద షాకే ఇచ్చింది అతని బ్రాండ్ కు వచ్చిన నష్టం అయితే ఏమి లేదు