Begin typing your search above and press return to search.

అభిమానులూ.. ఇదేం ఖర్మ!?

By:  Tupaki Desk   |   11 April 2018 5:52 AM GMT
అభిమానులూ.. ఇదేం ఖర్మ!?
X
అభిమానులు అన్నాక తమ హీరోకు ఫ్లెక్సీలు కట్టడం హడావిడి చేయడం సహజంగా జరిగేదే. కానీ ఇలాంటివి ఏ సినిమా రిలీజ్ కో.. తమ హీరో పుట్టిన రోజుకో.. ఏదైనా సెలబ్రేషన్ కోసమో ఇలాంటివి చేస్తే బాగానే ఉంటుంది.

ఇప్పుడు ముంబైలో సల్మాన్ ఫ్లెక్సీలతో అభిమానులు హంగామా చేస్తున్నారు. వీరితో పాటు కొన్ని అడ్వర్టైజింగ్ కంపెనీలు కూడా తోడయ్యాయి. వీరంతా కలిసి ముంబై వీధుల్లో సల్మాన్ ప్లెక్సీలతో హంగామా చేస్తున్నారు. వెల్కం బ్యాక్ భాయ్ జాన్ అంటూ.. తిరిగొచ్చిన తమ హీరోకు స్వాగతం.. శుభాకాంక్షలు చెబుతూ ఫ్లెక్సీలు కట్టేశారు. చూసిన జనాలు ఇదేం దరిద్రమో అని పైకే తిట్టేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో అయితే ఇంతకంటే గట్టి మాటలతోనే తిడుతున్నారు. సల్మాన్ ఖాన్ ఏమైనా దేశ సేవ చేసి వచ్చాడా..బోర్డర్ లో యుద్ధం చేసి వచ్చాడా.. ఇలా హడావిడి చేయాల్సిన అవసరం ఏంటన్నది వారి వాదన.

ఇక్కడ సల్మాన్ ఖాన్ జైల్ నుంచి వచ్చాడు. నోరు లేని వన్యప్రాణులు అయిన కృష్ణ జింకలను వేటాడిన కేసులో ప్రధాన ముద్దాయి మాత్రమే కాదు.. ఇప్పటికే కేసు నిరూపితం అయిపోయి దోషిగా కూడా తేలాడు. చివరకు తన పలుకుబడి ప్లస్ స్తోమత ఉపయోగించి బెయిల్ తీసుకుని బైటకు వచ్చాడు. అలాంటి సిగ్గుమాలిన పరిస్థితిలో ఇలా ఫ్లెక్సీలు కట్టి స్వాగతాలు చెప్పడం ఏంటని నిలదీస్తున్న జనాలకు.. సల్మాన్ అభిమానులు ఏం సమాధానం చెబుతారో?